iDreamPost
android-app
ios-app

Youtube: 1బిలియన్ వ్యూస్ కొట్టిన పాటలు ఇవే!!

Youtube: 1బిలియన్ వ్యూస్ కొట్టిన పాటలు ఇవే!!

డిజిటల్ విప్లవం వచ్చిన కొత్తలో యూట్యూబ్ పేరు పెద్దగా ఎవరికీ తెలిసింది కాదు. కానీ, స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో, ఇప్పుడు అన్ని రకాల కంటెంట్ కు యూట్యూబ్ వీడియోలు రిఫెరెన్స్ గా మారుతున్నాయి. అలా ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదించేవారికి యూట్యూబ్ అద్భుతమైన వేదికైంది. తాజాగా ఇన్నేళ్ళ యూట్యూబ్ ప్రయాణంలో 1బిలియన్ పైన వ్యూస్ వచ్చిన మ్యూజిక్ వీడియోలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చింది యూట్యూబ్.

భక్తి గీతాల దగ్గర నుంచి వెస్టర్న్ బీట్స్ వరకు అన్నీ యూట్యూబ్ లోనే. ఎవరి అభిరుచికి తగ్గట్లుగా వారు సంగీతాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఇప్పటివరకు 1బిలియన్ వ్యూస్ దక్కించుకన్న ప్లేలిస్ట్ ను క్రియేట్ చేసింది.

 

 

ఈ లింక్ ను క్లిక్ చేస్తే చాలు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లకొద్దీ వ్యూస్ దక్కించుకున్న పాటల్ని మీరు కూడా ఆస్వాదించొచ్చు. ఈ ప్లే లిస్ట్ లో మొత్తం 318 పాటలున్నాయి. ఇందులో ఎక్కువగా పాశ్చాత్య సంగీతానికి సంబంధించిన పాటలే ఉన్నప్పటికీ కొన్ని చాలామందికి తెలిసినవీ, మరికొన్ని దేశీ పాటలైన రౌడీ బేబీ, లాంగ్ లాచీ వంటి పాపులర్ సాంగ్స్ కూడా చేర్చడం విశేషం. తాము 90’s కిడ్స్ అని ఫీల్ అయ్యేవాళ్ళకు ఈ ప్లే లిస్ట్ ఒక గొప్ప జ్ఞాపకాల తెరను మళ్ళీ కదిలిస్తుంది.

కంటెంట్ క్రియేటర్లు పెరిగిపోవడంతో అన్ని వయసుల వారికి తగ్గ కంటెంట్ ను దాదాపు ఉచితంగానే అందిస్తోంది యూట్యూబ్. ఇక మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పేంది ఏముంది.. అలా ప్రజలందరూ ఎక్కువసార్లు విని, ఇంకా వింటూ ఆదరిస్తున్న పాటల్ని ఒక దగ్గరకు చేర్చి త్రో బ్యాక్ గా ఇవ్వడంతో యూట్యూబ్ ను మెచ్చుకుంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet