iDreamPost
android-app
ios-app

ప్రియురాలి పెళ్లి చెడగొట్టిన ప్రియుడు.. ఆత్మహత్య చేసుకున్న యువతి..

  • Published Jun 09, 2022 | 9:00 AM Updated Updated Jun 09, 2022 | 9:00 AM
  • Published Jun 09, 2022 | 9:00 AMUpdated Jun 09, 2022 | 9:00 AM
ప్రియురాలి పెళ్లి చెడగొట్టిన ప్రియుడు.. ఆత్మహత్య చేసుకున్న యువతి..

తన ప్రియురాలి పెళ్లిని చెడగొట్టేందుకు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు, చాటింగ్, వాయిస్‌ మెసేజ్‌లను కాబోయే భర్తకు పంపాడు ఓ ప్రబుద్దుడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంట గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

జాజులకుంట గ్రామానికి చెందిన బత్తుల అలేఖ్య (24) రెండేళ్ల నుంచి నల్లజర్లకు చెందిన కారు డ్రైవర్‌ బైపే రవితేజతో ప్రేమలో ఉంది. ఈ విషయం అలేఖ్య ఇంట్లో తెలిసి కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన ముంగమూరి బుచ్చిబాబు అనే వ్యక్తితో పెళ్లి కుదిర్చారు. ఈనెల 4న నిశ్చితార్థ వేడుక జరగగా 9న గురువారం వివాహం నిశ్చయించారు. అలేఖ్య కూడా అన్ని మర్చిపోయి వివాహానికి సిద్దపడింది.

అయితే ఈ విషయం తెలిసిన ప్రియుడు రవితేజ ఆమె వివాహాన్ని చెడగొట్టాలని తనతో అలేఖ్య సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు, చాటింగ్, వాయిస్‌ మెసేజ్‌లను అతడి స్నేహితుడు సునీల్‌ అనే వ్యక్తి సెల్‌ఫోన్‌ నుంచి పెళ్లికొడుకు ఫోన్‌కు వాట్సాప్‌ ద్వారా పంపించాడు. ఈ విషయం తెలిసి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో మనస్థాపం చెందిన అలేఖ్య ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. కుటుంబసభ్యులు గుర్తించి తలుపులు పగులకొట్టి లోపలి వెళ్లి చూసేసరికి అలేఖ్య మృతి చెందింది. అలేఖ్య తల్లి ఫిర్యాదు మేరకు రవితేజ, సునీల్‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabet