Uppula Naresh
Uppula Naresh
77వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. దాదాపు అన్ని చోట్ల ప్రశాంతంగా జెండా అవిష్కరణ జరిగింది. అయితే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సీఎం మాట్లాడుతుండగా ఓ యువకుడు స్టేజ్ పైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం సీఎం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడుతుండగా గుంపు నుంచి ఓ యువకుడు స్టేజ్ పైకి దూసుకొచ్చాడు. దీంతో వెంటనే స్పందించిన హై సెక్యూరిటీ ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విషయం ఏంటంటే? తనకు కారుణ్య నియామకం కింద గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని పోస్టర్ తో వచ్చి హల్ చల్ చేశాడు. దీంతో ఆ సభలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
— Hardin (@hardintessa143) August 15, 2023
ఇది కూడా చదవండి: విద్యాశాఖపై సీఎం జగన్ కీలక సమీక్ష..