iDreamPost
android-app
ios-app

ఉద్యోగం ఇవ్వము అన్నారు.. హ్యాకర్ అయి కోట్లు కొట్టేశాడు..

  • Published May 12, 2022 | 6:19 PM Updated Updated May 12, 2022 | 6:19 PM
ఉద్యోగం ఇవ్వము అన్నారు.. హ్యాకర్ అయి కోట్లు కొట్టేశాడు..

చదువు మధ్యలోనే ఆపేసి ఎథికల్ హ్యాకర్ గా మారిన ఓ యువకుడు తనకి ఓ కంపెనీ ఉద్యోగం ఇవ్వలేదని క్రిమినల్ హ్యాకర్ గా మారి పలు కంపెనీల్లో కోట్లు కొట్టేశాడు. కృష్ణా జిల్లా పెడనకు చెందిన దినేష్ అనే యువకుడు బీటెక్ మధ్యలోనే ఆపేసి ఎథికల్ హ్యాకర్ గా మారాడు. సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఫ్రీలాన్స్ గా బగ్స్ కనిబెడుతూ డబ్బులు సంపాదించేవాడు. ఈ నేపథ్యంలో అమెరికన్ కంపెనీ ఇనస్టామోజోలో కూడా బగ్స్ కనిబెట్టాడు.

దీంతో ఆ కంపెనీ డబ్బులు ఇచ్చినా ఉద్యోగం కావాలని అడిగాడు. అయితే ఆ కంపెనీ నో చెప్పడంతో దినేష్ ఎథికల్ హ్యాకర్ నుంచి క్రిమినల్ హ్యాకర్ గా మారాడు. పేమెంట్ గేట్ వేలను టార్గెట్ చేసి వాటిని హ్యాకింగ్ చేసి డబ్బులు కొట్టేసేవాడు. దీనికోసం నకిలీ ఐడీలు, కంపెనీలు క్రియేట్ చేసేవాడు. ఢిల్లీకి చెందిన ఓ యాప్ తో బిజినెస్ మాట్లాడుకొని ఆ తర్వాత దాని పేమెంట్ గేట్ వేలోకి ప్రవేశించి 60 లక్షలు కొట్టేశాడు. అప్పట్నుంచి వరుసగా పలు కంపెనీలలో కాజేస్తున్నాడు. తాజాగా ఎక్స్-సిలికా అనే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ నుంచి 52.9 లక్షలు కొట్టేయడంతో పోలీసు కేసు నమోదు చేశారు.

దీంతో పోలీసులు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడి దినేష్ ను, అతడి స్నేహితుల్ని పట్టుకున్నారు. దినేష్ ను విచారించగా నాలుగేళ్లలో దాదాపు 3 కోట్ల రూపాయలు కొట్టేసినట్లు తెలిపాడు. డబ్బులు కొట్టేసినట్లు అనుమానం రాకుండా ఆ డబ్బులన్నీ బిజినెస్ అవుతున్నట్టు విజయవాడలో పలు స్టార్తప్ కంపెనీలు పెట్టాడు. ఇలా కోట్లలో మోసం చేసిన ఓ హ్యాకర్ ని పట్టుకున్న పోలీసులు అతడు చేసిన మోసాల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.