iDreamPost
iDreamPost
కొంతమంది చదువుపైన ఇష్టంతో ఓ పక్క పనులు చేస్తూ, కష్టపడుతూనే మరో పక్క తమకి నచ్చిన చదువు చదువుకుంటారు. తాజాగా ఓ యువతి గ్రామ సర్పంచ్ గా సేవలు అందిస్తూనే మరో పక్క M.Tech పట్టా సాధించడమే కాక టాపర్ గా నిలిచింది.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడు సర్పంచి మౌనిక ఎమ్మిగనూరు సరస్వతి విద్యానికేతన్‌లో పదో తరగతి, చిత్తూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమో, ప్రొద్దుటూరు యోగి వేమన విశ్వ విద్యాలయం నుంచి బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత పెద్దమర్రివీడు గ్రామ సర్పంచి రిజర్వేషన్‌ను మహిళలకు కేటాయించడంతో తండ్రి నరసన్న ప్రోత్సాహంతో ఫిబ్రవరి 21, 2021న జరిగిన ఎన్నికల్లో మౌనిక గ్రామ సర్పంచ్ గా విజయం సాధించింది.
అప్పట్నుంచి ఓ పక్కన గ్రామానికి సేవలు అందిస్తూనే మరో పక్క అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్‌లో ఎంటెక్ పూర్తి చేసి 89.92 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచింది. తాజాగా జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతులమీదుగా ఆమె పురస్కారం అందుకుంది. ఆమె మా గ్రామానికే గర్వకారణం అని ఆ గ్రామ ప్రజలు అంటున్నారు.