iDreamPost
iDreamPost
సాధారణంగా మనం ఫోన్ లో నెంబర్ ఫలానా పేరుతో సేవ్ చేసుకుంటేనే ఫోన్ చేసినప్పుడు మనకి ఫోన్ స్క్రీన్ పై పేరు పడుతుంది. లేదా ఇటీవల ట్రూ కాలర్ యాప్ ద్వారా మన ఫోన్ లో ఆ యాప్ ఉంటే తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చినా అవతలి వ్యక్తి పేరు కనిపిస్తుంది. కానీ ట్రూకాలర్ లో కొన్ని సార్లు అసలైన పేరు రావడంలేదు. తాజాగా టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) దీనికి పరిష్కారం తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.
ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వారి నెంబర్ మన దగ్గర లేకపోయినా ఫోన్ స్క్రీన్ పై వారి పేరు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) రెడీ అవుతుంది. ట్రాయ్ ప్రతిపాదన ప్రకారం మనకి తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చినా పేరు కనపడేలా చర్యలు తీసుకునేందుకు టెలికాం విభాగంతో చర్చలు నిర్వహిస్తుంది.
త్వరలోనే ఈ చర్చలు ఫలించి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రాయ్ ఛైర్మన్ పీడీ వాఘేలా తెలిపారు. ఇది అమలులోకి వస్తే మనకి తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా పేరు వచ్చేందుకు మన ఫోన్ నంబర్ కి KYC అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే KYC అప్డేట్ చేసిన నంబర్లతో మొదట ప్రయోగం చేయనున్నారు.