iDreamPost
android-app
ios-app

నోబెల్‌ వాళ్ళు ‘బాబు’కు దెబ్బేసారట..!

  • Published Oct 15, 2020 | 3:07 PM Updated Updated Oct 15, 2020 | 3:07 PM
నోబెల్‌ వాళ్ళు ‘బాబు’కు దెబ్బేసారట..!

వైఎస్సార్‌సీపీ నేత వి. విజయసాయిరెడ్డి చేసే వ్యాఖ్యలకు సోషల్‌ మీడియాలో ఫాలోవర్లే కాకుండా ప్రత్యకంగా అభిమానులే ఉంటారు. ఆయన చేసే వ్యాఖ్యలు సూటిగా, స్పష్టంగా ఉండడంతో వాటి పట్ల ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి మీద విజయసాయిరెడ్డి చేసే వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. గతంలో సైతం సంచలనాలకు కేంద్రంగా ఇటువంటి వ్యాఖ్యలు మారాయి. ఒక్కోసారి విజయసాయి చేసే వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదంటే ఆయన వ్యాఖ్యలు ఏ స్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా చంద్రబాబునుద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన ఫాలోవర్ల అటెన్షన్‌ను పెంచాయి. వేలం పాటల విధానానికి సంబంధించి ఇటీవలే నోబెల్‌ జ్యూరి బహుమతులు ప్రకటించింది. దీనిని బేస్‌చేసుకుని విజయసాయి తన పదునైన వ్యాఖ్యలు సంధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వేలం పాటల విషయంలో చంద్రబాబును మించిన వారు లేరని, అటువంటిది ఆయనకు కాకుండా వేరెవరికో నోబెల్‌ బహుమతి ప్రకటించడం ఏంటంటూ కామెంట్లు చేసి హీటు పుట్టించారు.

గతంలో వైఎస్సార్‌సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ఇలా వేలంపాటల ద్వారానే కొనుగోలు చేసారని, ఇటువంటి విషయాల్లో ఆయన్ను మించిన వారు లేరంటూ దానిని కొనసాగించారు. నోబెల్‌ జ్యూరి కమిటీ చంద్రబాబు పేరును కూడా పరిశీలించాలని కూడా ఆయన పనిలోపనిగా కోరేసారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను వేలంపాటలో 23 మందిని తీసుకుపోతే, దేవుడు ఇప్పుడు 23 మందిని మాత్రమే మిగల్చారంటూ సెటైర్లు వేసారు. అయితే దీనిపై ఇప్పటి వరకు టీడీపీ నాయకుల నుంచి ఎటువంటి కౌంటర్లు లేకపోవడం గమనార్హం.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommarsbahisMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/