iDreamPost
android-app
ios-app

కరోనాతో వైసీపీ ఎంపీ మృతి

కరోనాతో వైసీపీ ఎంపీ మృతి

వైఎస్సార్‌సీపీ నేత, తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌ (64) ఇక లేరు. పక్షం రోజులుగా కరోనా వైరస్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న బల్లి దుర్గా ప్రసాద్‌ కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో మరణించారు. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచిన బల్లి దర్గా ప్రసాద్‌ 1996–98 మధ్య విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నుంచి ఆయన నాలుగు సార్లు ఎమ్మెలేగా గెలుపొందారు. 1985, 1994, 1999, 2009లో శాసన సభ్యుడిగా ఎన్నియ్యారు. 2014 ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన దుర్గా ప్రసాద్‌ను కాదని చంద్రబాబు.. బత్తుల రాథా జ్యోత్స లతకు టికెట్‌ ఇచ్చారు. బల్లి దుర్గా ప్రసాద్‌ టీడీపీలో కొనసాగినా.. అయనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు.

2019 ఎన్నికలకు ముందు గూడూరు ఎమ్మెల్యే సునీల్‌ టీడీపీలోకి వెళ్లడంతో బల్లి దుర్గా ప్రసాద్‌ వైసీపీలో చేరారు. తిరుపతి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న వరప్రసాద్‌ రావుకు గూడూరు అసెంబ్లీ టిక్కెట్‌ కేటాయించిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. తిరుపతి ఎంపీగా దర్గా ప్రసాద్‌కు అవకాశం కల్పించారు. ఎంపీగా ఎన్నికై ఏడాదిన్నర లోపే దర్గా ప్రసాద్‌ మృతి చెందడం అయన అనుచరులలో విషాాదం నింపింది.