iDreamPost
android-app
ios-app

భారత్‌లో పేదరికం తగ్గిందట..!

2011తో పోల్చితే 2019లో పేదరికం పరిస్థితి మెరుగుపడిందని చెప్పింది. 2011లో 22.5 శాతం ఉన్న పేదరికం.. 2019లో 10.2 శాతానికి పడిపోయిందని వివరించింది.

2011తో పోల్చితే 2019లో పేదరికం పరిస్థితి మెరుగుపడిందని చెప్పింది. 2011లో 22.5 శాతం ఉన్న పేదరికం.. 2019లో 10.2 శాతానికి పడిపోయిందని వివరించింది.

భారత్‌లో పేదరికం తగ్గిందట..!

భారత్ లో పేదరికం తగ్గిందని వరల్డ్ బ్యాంక్ చెబుతోంది. 2011తో పోలిస్తే 2019లో భారత్ లో పేదరికం భారీగా తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. తొమ్మిదేళ్లలో ఏకంగా 12.3శాతం మేర పేదరికం తగ్గిందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. 2011తో పోల్చితే 2019లో పేదరికం పరిస్థితి మెరుగుపడిందని చెప్పింది. 2011లో 22.5 శాతం ఉన్న పేదరికం.. 2019లో 10.2 శాతానికి పడిపోయిందని వివరించింది.

ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రపంచబ్యాంకు తెలిపింది. అర్బన్ ప్రాంతాల్లో పేదరికం 14.2 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గిందని పరిశోధన నివేదికలో ప్రపంచబ్యాంకు వెల్లడించింది. చిన్న కమతాలున్న రైతులు అధిక లాభాలు పొందుతున్నారని ప్రపంచబ్యాంక్ నివేదిక తెలిపింది. పెద్ద కమతాలున్న రైతుల వార్షిక ఆదాయం 2శాతం మేర పెరిగితే, చిన్న రైతుల ఆదాయం 10శాతం పెరిగినట్లు వివరించింది. మొత్తంగా భారత్ లో దశాబ్దకాలంలో పేదరికం తగ్గిందన్న వరల్డ్ బ్యాంక్.. కానీ, అనుకున్నంతగా తగ్గలేదని పేర్కొంది.

ప్రపంచబ్యాంకు వర్కింగ్ పేపర్‌ లో తెలిపిన వివరాల ప్రకారం.. మనదేశంలో పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గుదల ఎక్కువగా ఉంది. 2011లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 26.3 శాతం ఉండేది. ఇది 2019లో 11.6 శాతానికి తగ్గిందని తెలిపింది. అదే సమయంలో అర్బన్‌ ప్రాంతాల్లో పేదరికం 14.2 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గిందని వివరించింది. 2011-2019లో గ్రామీణ, పట్టణ పేదరికం 14.7, 7.9 శాతం పాయింట్లు తగ్గాయని ఆ నివేదిక పేర్కొంది.

భారత్ లో పేదరికం తగ్గిందని ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా ఇదే విధంగా చెప్పిన సంగతి తెలిసిందే. భారతదేశం తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించిందని ఐఎంఎఫ్ వర్కింగ్ పేపర్ వెల్లడించింది. ప్రభుత్వం ఉచితంగా ఆహార సరుకులను అందజేస్తుండటంతో వినియోగంలో అసమానతలు 40 ఏళ్లలో కనిష్ట స్థాయికి తగ్గిపోయినట్లు తెలిపింది.

అయితే, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ల అంచనాలు 2019 నాటివి కావడం ఇక్కడ గమనించాల్సిన అంశం. 2019 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2019 ఆఖరులో చైనాలో కరోనా వైరస్‌ వెలుగుచూడడం, 2020 మార్చి నుంచి దాని ప్రభావం భారత్‌పై పడడంతో.. గడిచిన రెండేళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవనప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమయ్యాయి. పేదరికం పెరిగింది. ఆదాయ, వ్యయ అసమానతలు పెరిగాయని వివిధ సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులతో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ గణాంకాలను బేరీజు వేసుకుంటే అవి వాస్తవ విరుద్ధంగా ఉంటాయనడంలో సందేహం లేదు.