భర్తలు మమ్మల్ని కొట్టినా ఫర్వాలేదు! – సర్వేలో షాకింగ్ నిజాలు

  • Published - 08:12 AM, Tue - 14 June 22
భర్తలు మమ్మల్ని కొట్టినా ఫర్వాలేదు! – సర్వేలో షాకింగ్ నిజాలు

ఆధునిక సమాజంలో మహిళులు సైతం పురుషులతో సమానంగా అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో ఇలాంటి సర్వేలు చెప్పే నిజాలు చాలా షాకింగ్ గా ఉంటాయి. మహిళలపై హింస పెరుగుతున్న కారణంగా నిర్వహించిన స్వరేలో మహిళలే విస్తుపోయే నిజాలు తెలిపారు.

గృహ హింస విషయంలో చాలా మంది మహిళలు ఆమోదం తెలుపడం ఆశ్ఛర్యం కలిగిస్తోంది. కొన్ని సందర్భాల్లో గృహహింస ఫర్వాలేదని చెప్పడం నిజంగా శోచనీయం. పైగా దీన్ని సమర్థించే వారి సంఖ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండటం మరింత షాకింగ్.

తెలుగు రాష్ట్రాల్లో80 శాతానికి పైగా భార్య లు, భర్తలు కొట్టడాన్ని సమర్థించినట్లు తెలుస్తోంది. కొన్ని కారణాలతో భార్య ను కొట్టడాన్ని 83.8 శాతం తెలంగాణ మహిళలు సమర్థిస్తూ ఈ జాబితాలో మందుండుగా, కాస్త తక్కవ వ్యత్యాసమైన (83.6) శాతంతో ఏపీ మహిళలు రెండో స్థానంలో ఉన్నారు. కర్ణాటకలో 81.9 శాతం మంది పురుషులు భార్యను కొట్టడం తప్పేమీ కాదనే భావనతో ఉన్నట్లు తేలింది.

25 శాతం భర్తలు తమ భార్య లను చెం ప దెబ్బ కొడుతున్ననారట. పురుషుల్లో ఈ అభిప్రాయం తగ్గుతూ ఉండగా, మహిళల్లో మాత్రం వయసుతో పాటు పెరుగుతోంది. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాం తాల్లోనే ఈ అభిప్రాయం కనిపిస్తోంది. అత్తమామలను గౌరవించని, చూసుకోని విషయంలో భార్య ను కొట్టొచ్చని 31 శాతం పురుషులు, 32 శాతం మహిళలు చెప్పారు.

దేశంలో మహిళల రక్షణకు కేం ద్ర, రాష్ట్రాల ప్రభుత్వా లు అనేక చట్టాలు చేస్తున్నా యి. చాలా సందర్భా ల్లో కఠిన శిక్షలు సైతం అమలు చేస్తున్నా, ప్రజల్లో ఇలాంటి వైఖరి ఉండటం అందరూ ఆలోచించాల్సిన విషయం.

Show comments