iDreamPost
android-app
ios-app

ప్రగతినగర్ లో దారుణం.. ఇంట్లో డ్రాప్ చేస్తామంటూ…

  • Published Jun 18, 2022 | 6:58 PM Updated Updated Jan 02, 2024 | 6:48 PM

అయితే పథకం ప్రకారమే దాడి చేశారా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్ కు చెందిన సదరు యువతి, నిజాంపేట్ దగ్గర ప్రగతినగర్లోని ఓ అపార్ట్ మెంట్లో ఒంటరిగా ఉంటోంది.

అయితే పథకం ప్రకారమే దాడి చేశారా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్ కు చెందిన సదరు యువతి, నిజాంపేట్ దగ్గర ప్రగతినగర్లోని ఓ అపార్ట్ మెంట్లో ఒంటరిగా ఉంటోంది.

  • Published Jun 18, 2022 | 6:58 PMUpdated Jan 02, 2024 | 6:48 PM
ప్రగతినగర్ లో దారుణం..  ఇంట్లో డ్రాప్ చేస్తామంటూ…

హైదరాబాద్ లో మహిళలపై లైంగిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఘటన మరువక ముందే, మరో యువతిపై అత్యాచారం జరిగింది. వరుస ఘటనలతో హైదరాబాద్ లో మహిళల భద్రతపై ఆందోళన కలుగుతోంది. అసలేం జరిగిందంటే?

క్రాంతి అనే యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా 28ఏళ్ళ యువతిని పార్టీకి పిలిచాడు. అందుకోసం జూబ్లీహిల్స్ లోని రిపీట్ పబ్ కు ఆమె స్నేహితులతో కలిసి వెళ్ళింది. రాత్రి 11:30 తరువాత ఆమె ఇంటివద్ద డ్రాప్ చేస్తామని క్రాంతితో పాటు మరో ముగ్గురు స్నేహితులు ఆమె ఇంటికి వచ్చారు. వారంతా ఆమె ఇంట్లోనే మద్యం సేవించారు.

అలా మాట్లాడుతూ తెల్లవారుజామున 5గంటల సమయంలో యువతి నిద్రలోకి జారుకుంది. అప్పుడే రోషన్ అనే యువకుడు 6:15 ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేసినట్లుగా ఆమె ఆరోపించింది. ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా, ఆమెను కొట్టి బలవంతంగా లైంగిక దాడి చేసినట్లుగా పేర్కొంది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేయగా రోషన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

వీరంతా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులని పేర్కొంటున్నారు పోలీసులు. అయితే పథకం ప్రకారమే దాడి చేశారా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్ కు చెందిన సదరు యువతి, నిజాంపేట్ దగ్గర ప్రగతినగర్లోని ఓ అపార్ట్ మెంట్లో ఒంటరిగా ఉంటోంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibomcasibom