iDreamPost
android-app
ios-app

వీడియో: రీల్స్ కోసం సరయూ నదిలో అశ్లీల నృత్యం!

  • Published Oct 11, 2023 | 4:24 PM Updated Updated Oct 11, 2023 | 4:38 PM
  • Published Oct 11, 2023 | 4:24 PMUpdated Oct 11, 2023 | 4:38 PM
వీడియో: రీల్స్ కోసం సరయూ నదిలో అశ్లీల నృత్యం!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఇన్ ప్లూయోన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు తరచుగా వివిధ రకాల వీడియోలు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ను చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే వెరైటీగా రీల్స్, వీడియోలు చేయాలని ఆలోచనలతో చాలా మంది యువత రిస్క్ చేసి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. అంతేకాక మరికొన్ని వీడియోలు పబ్లిక్ నుంచి వీవ్యూస్, లైక్ లు దక్కించుకున్నపటికీ, కాస్తా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ యువతి సరయు నదిలో  అశ్లీల నృత్యాలు చేస్తూ రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో సరయూ నది ప్రవహిస్తుంది. ఈ నదిని  అక్కడి ప్రజలు ఎంతో పవిత్రంగా భావించి.. పూజలు చేస్తుంటారు. అలానే సరయూ నదిలో పవిత్ర స్నానం చేసేందుకు యాత్రికులు పెద్ద సంఖ్యలో ఘాట్ కి వస్తుంటారు. అయితే తాజాగా ఓ యువతి ఆ సరయూ నదిలో రీల్స్ చేసింది. సదరు యువతి రీల్స్ కోసం సరయూ నదిలోకి దిగి నృత్యం చేసింది. ఆ యువతి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పింక్ సల్వార్ సూట్ ధరించిన యువతి  ‘జీవన్ మే జానే జానా’ అనే బాలీవుడ్ పాటకు డ్యాన్స్  చేస్తూ కనిపించింది.

అంతేకాక హాట్ హాట్ గా ఫోజులు ఇస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టేలా, పబ్లిక్ ను ఇబ్బంది పెట్టేలా ఆ యువతి డ్యాన్స్ చేసింది. సదరు యువతిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన చాలామంది పవిత్ర స్థలాన్ని అగౌరవపర్చిన సదరు మహిళపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఆ మహిళపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అయోధ్య పోలీసులు ఆమెపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మరి.. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom