iDreamPost

‘యానిమల్’ సాంగ్ లో అర్జున్ రెడ్డి ‘మధురమే’ ఛాయలు.. గమనించారా

  • Author ajaykrishna Published - 03:26 PM, Wed - 11 October 23
  • Author ajaykrishna Published - 03:26 PM, Wed - 11 October 23
‘యానిమల్’ సాంగ్ లో అర్జున్ రెడ్డి ‘మధురమే’ ఛాయలు.. గమనించారా

అర్జున్ రెడ్డి సినిమాతో అందరి మైండ్ బ్లాక్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తనవైపు తిరిగి చూసేలా చేశాడు. అదే సినిమాతో అటు హీరోగా విజయ్ దేవరకొండ.. ఓవర్ నైట్ ఊహించని ఫేమ్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డిలో విజయ్, షాలినిల కెమిస్ట్రీకి నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఎందుకంటే.. సందీప్ ఆ సినిమాని తీయడమే చాలా బోల్డ్ గా తీసి.. ప్రెజెంట్ చేశాడు. కట్ చేస్తే.. సినిమా పోస్టర్స్ దగ్గర నుండి ఎన్నో విమర్శలు, వివాదాలు ఫేస్ చేసింది. అన్నింటి మధ్య విడుదలై థియేట్రికల్ గా మూవీ బిగ్ సక్సెస్ అయ్యింది. అదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ పేరుతో తీశాడు.

తెలుగులో బోల్డ్ కంటెంట్ అంటే.. కొంచం వ్యతిరేకత ఏర్పడుతుందేమో గానీ.. బాలీవుడ్ లో అలా ఏం ఉండదు. ఎందుకంటే.. అక్కడ బోల్డ్ కంటెంట్ ఎప్పటినుండో ఫేమస్. అందుకే వాళ్లకు కబీర్ సింగ్ రొమాన్స్ అనేది నార్మల్ గా అనిపించి ఉండొచ్చు. ఇక ఇప్పుడు సందీప్ రెండో కథ యానిమల్. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా.. రష్మిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా టైటిల్ కి తగ్గట్టుగా బోల్డ్ గా, వయిలెంట్ గా ఉండబోతుందని టీజర్ తో ప్రూవ్ చేశాడు. ఇప్పుడు ఇందులో రొమాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి శాంపిల్ చూపించాడు సందీప్.

యానిమల్ సినిమా డిసెంబర్ 1న థియేటర్స్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. అందుకే మెల్లగా ఇప్పటినుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. కాగా.. తాజాగా యానిమల్ నుండి విడుదలైన ఫస్ట్ వీడియో సాంగ్ కూడా మైండ్ బ్లాక్ చేస్తుంది. ఎందుకంటే.. హీరో హీరోయిన్స్ మధ్య కిస్సింగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఒక రకంగా ఫ్యామిలీ ముందే కిస్ చేసుకోవడం అంటే.. దాదాపు అర్జున్ రెడ్డి పోలికలు ఉన్నాయని అనిపిస్తుంది. అంటే.. హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ విషయంలో అర్జున్ రెడ్డి టచ్ ఉంది. అర్జున్ రెడ్డిలో మధురమే సాంగ్ ఎవరు మర్చిపోలేరు. ఇందులో ఈ సాంగ్ కూడా అంతే. రష్మిక నుండి ఇన్ని లిప్ లాక్ మూమెంట్స్ ఎవరు ఎక్స్ పెక్ట్ చేసుండరు. సాంగ్ లోనే ఇలా ఉంటే.. ఇంకా సినిమాలో ఏమున్నాయో రిలీజ్ వరకు ఆగాలి. మరి యానిమల్ ఫస్ట్ సాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి