iDreamPost
android-app
ios-app

అమ్మ లేకపోయినా అన్నా డీఎంకే రాణించడంలో ఎవరి పాత్ర ఎంత..?

  • Published May 02, 2021 | 8:02 AM Updated Updated May 02, 2021 | 8:02 AM
అమ్మ లేకపోయినా అన్నా డీఎంకే రాణించడంలో ఎవరి పాత్ర ఎంత..?

తమిళనాడు రాజకీయాలు సహజంగా ఏకపక్షంగా ఉంటాయి. ఏదో ఒక పార్టీని అక్కడి ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించడం ఆనవాయితీ. కానీ గత ఎన్నికల్లో మారిన ఈ సంప్రదాయం ఈసారి కూడా కొనసాగింది. బలమైన ప్రతిపక్షానికి అవకాశం దక్కింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాల్లో అధికారం చేతులు మారుతుండగా బలమైన ప్రతిపక్ష పాత్రలో అన్నా డీఎంకే కనిపించబోతోంది.

జయలలిత మరణం తర్వాత తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే సుమారుగా 80 సీట్లు సాధించే అవకాశం ఉంది. ఈ స్థాయిలో ఆపార్టీ విజయం సాధించడం విశేషంగానే చెప్పాలి. పన్నీర్ సెల్వం, పళని స్వామి నేతృత్వంలోని పార్టీ ఈ రీతిలో సీట్లు సాధించడం వెనుక బీజేపీ పెద్దల వ్యూహ చతురత ఉన్నట్టు కనిపిస్తోంది. ఆపార్టీ పెద్దలంతా అన్నా డీఎంకే అంతా తామై నడిపించారు. చివరకు తమిళనాడు అసెంబ్లీలో బీజేపీ కూడా నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండడం కీలక పరిణామంగా చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ సున్నా స్థానాలకే పరిమితమయ్యింది.

ఈసారి బీజేపీతో పాటుగా అన్నా డీఎంకే కూడా పరువు నిలబెట్టుకునే రీతిలో ఓట్లు, సీట్లు దక్కించుకోవడం వెనుక బీజేపీ ఎత్తులు ఫలించినట్టుగా చెప్పవచ్చు. అడుగడుగునా డీఎంకేని అడ్డుకునేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. పోలింగ్ ముందు రోజు వరకూ వివిధ దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహిస్తూనే ఉన్నాయి. డీఎంకే ఎన్నికల ప్రచారం, ఇతర వ్యహారాలకు అడ్డుకట్ట పడుతూనే ఉంది. అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత స్టాలిన్ కి సీఎం హోదా దక్కడానికి దోహదపడుతుండగా కొత్త అసెంబ్లీలో అన్నా డీఎంకే కూటమి కీలక పాత్ర పోషించబోతోంది.

మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గానూ 118 స్థానాల్లో డీఎంకే, 80 సీట్లలో అన్నా డీఎంకే , 12 చోట్ల కాంగ్రెస్, , 10 సీట్లలో పీఎంకే, 4 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. సీపీఐ, సీపీఎం కూడా చెరో రెండు స్థానాలు దక్కించుకునే దిశలో ఉన్నాయి. ఇక కన్యాకుమారి పార్లమెంట్ ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి ని ఓడించి ఆపార్టీ ఈ సీటు కైవసం చేసుకుంది.

Also Read : తమిళనాట పొద్దు పొడుస్తోంది.. డీఎంకే ఆధిక్యంతో స్టాలిన్ కల నెరవేరబోతోంది..