iDreamPost
android-app
ios-app

చిరంజీవి, నాగార్జున సర్దుకున్నారా ?

  • Published Sep 13, 2022 | 3:47 PM Updated Updated Dec 07, 2023 | 11:21 AM

ఆ మధ్య లాల్ సింగ్ చడ్డాని చిరు సమర్పకుడిగా వ్యవహరించడానికి సగం కారణం అమీర్ ఖాన్ అయితే మరో సగం నాగ చైతన్య. అంతగా రెండు కుటుంబాల మధ్య బాండింగ్ ఉంటుంది.

ఆ మధ్య లాల్ సింగ్ చడ్డాని చిరు సమర్పకుడిగా వ్యవహరించడానికి సగం కారణం అమీర్ ఖాన్ అయితే మరో సగం నాగ చైతన్య. అంతగా రెండు కుటుంబాల మధ్య బాండింగ్ ఉంటుంది.

చిరంజీవి, నాగార్జున సర్దుకున్నారా ?

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునల మధ్య ఎంత ఘాడమైన స్నేహం ఉందో అందరికి తెలిసిందే. ఆ మధ్య లాల్ సింగ్ చడ్డాని చిరు సమర్పకుడిగా వ్యవహరించడానికి సగం కారణం అమీర్ ఖాన్ అయితే మరో సగం నాగ చైతన్య. అంతగా రెండు కుటుంబాల మధ్య బాండింగ్ ఉంటుంది. ఈ కారణంగానే ఇద్దరి మధ్య ఎప్పుడూ బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడలేదు. కానీ గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ రెండు అక్టోబర్ 5నే వచ్చేందుకు పోటీ పడటం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఇలా చేస్తే ఓపెనింగ్స్ దెబ్బ తింటాయని, న్యూట్రల్ ఆడియన్స్ ని ఎవరో ఒకరు తగ్గించుకోవడమో లేదా పోగొట్టుకోవాల్సి ఉంటుందని ట్రేడ్ సైతం బయటికి చెప్పలేని టెన్షన్ తో సతమతమవుతోంది.

అందుకే దీనికి మధ్యే మార్గంగా ఒక పరిష్కారం కనుగొన్నారని ఇన్ సైడ్ టాక్. ది ఘోస్ట్ 5కు బదులు రెండు రోజులు లేట్ గా 7వ తేదీన వచ్చేలా ప్లానింగ్ జరుగుతోందట. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ లీకవుతున్న సోర్స్ నమ్మదగినదిగానే ఉంది. దసరాకు కనీసం ఏడెనిమిది రోజులు సెలవులు ఉంటాయి కాబట్టి ఆ సీజన్ ని క్యాష్ చేసుకోవాలన్నది నిర్మాతల ప్లాన్. అయిదో తారీఖు బుధవారం కాబట్టి లాంగ్ వీకెండ్ దొరుకుతుంది. అలా అని చిరు నాగ్ లు పరస్పరం ఢీ కొడితే దేనికైనా డివైడ్ టాక్ వస్తే అది దెబ్బ తినే అవకాశాలు ఇంకా పెరుగుతాయి. అందుకే ఎవరో ఒకరు వెనక్కు తగ్గడం ఇప్పుడున్న పరిస్థితిలో చాలా అవసరం.

గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ దేనికవే ప్రత్యేకమైన అంచనాలతో రూపొందాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికైతే మెగా మూవీ మీద ఏమంత హైప్ లేదు. లూసిఫర్ రీమేక్ కావడంతో పాటు ఎప్పటిలాగే కొణిదెల సంస్థ నిర్లిప్తత ప్రమోషన్లను దెబ్బ తీస్తోంది. ఎల్లుండి సల్మాన్ ఖాన్ చిరంజీవిల కాంబో లిరికల్ సాంగ్ ని విడుదల చేయబోతున్నారు. తమన్ ఏ రేంజ్ లో కంపోజ్ చేసుంటాడోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ది ఘోస్ట్ నాగార్జునకు చాలా గ్యాప్ తర్వాత హిట్ ఇస్తుందన్న నమ్మకం మూవీ లవర్స్ లో ఉంది. ట్రైలర్ చూశాక ప్రవీణ్ సత్తారు టేకింగ్ మీద నమ్మకం పెరిగింది. మరి ఈ ఇద్దరు మిత్రులు ఒక అండర్ స్టాండింగ్ కి వస్తారా లేదా అనేది వేచి చూడాలి

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet