iDreamPost
డేటింగ్ చేశారు. జంటగా మారారు. సారాతో డేటింగ్ కు విజయ్ రెడీ. ఈ లెక్కన వీరిద్దరూ ఎందుకు జంటకాకూడదు? ఇది ముంబై ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్.
డేటింగ్ చేశారు. జంటగా మారారు. సారాతో డేటింగ్ కు విజయ్ రెడీ. ఈ లెక్కన వీరిద్దరూ ఎందుకు జంటకాకూడదు? ఇది ముంబై ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్.
iDreamPost
అలియా భట్-రణబీర్ కపూర్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ తర్వాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకొంటారని ఎందుకు ముంబై మీడియా అంచనాలు వేస్తోంది?
సారా అలీ ఖాన్ – విజయ్ దేవరకొండ ఒకరితో ఒకరు డేటింగ్ మొదలుపెట్టి, ఇద్దరూ పెళ్లివరకు వెళ్తారని చెప్పడం తొందరపాటే అయినా, అలియా భట్-రణబీర్ కపూర్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, దీపికా పదుకొనే-రణ్వీర్ సింగ్ ఇలాగే ఒకరితో మరొకరు డేటింగ్ చేయాలన్న కోరికను Koffee With Karanలో బైటపెట్టారు. డేటింగ్ చేశారు. జంటగా మారారు. సారాతో డేటింగ్ కు విజయ్ రెడీ. ఈ లెక్కన వీరిద్దరూ ఎందుకు జంటకాకూడదు? ఇది ముంబై ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్.
Koffee With Karan 7 అనుకున్నంతగానే హడావిడి చేస్తోంది. బెస్ట్ ఫ్రెండ్స్ సారా అలీ ఖాన్(Sara Ali Khan), జాన్వీ కపూర్(janhvi kapoor) నెక్ట్స్ ఎపిసోడ్ కోసం వస్తున్నారు. షోలో, సారా అలీ ఖాన్‌ను డేటింగ్ చేయడానికి ఇష్టపడే స్టార్ ఎవరని కరణ్ జోహార్ అడిగాడు. ఇదే ప్రశ్నకు 2018లో ఆమె ఆన్సర్, సోషల్ మీడియాలో ఎలా వైరల్ అయ్యిందో ఫ్యాన్స్ కు తెలుసు. కార్తిక్ ఆర్యన్‌తో డేటింగ్ చేయడం తనకు ఇష్టమన్న సారా, ఈసారి విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) పేరుచెప్పింది. విజయ్ పేరు సారా అలీ ఖాన్ చెప్పడం చూసి, కరణ్ జోహార్ కూడా ఆశ్చర్యపోయాడు. సారా అలీ ఖాన్ చెప్పినదానితో liger హీరో రియాక్ట్ అయ్యాడు. అనన్య పాండేతో కలిసి షోకి విజయ్ వస్తున్నాడు. ఏం చెబుతాడో చూడాలి.
కరణ్ జోహార్ చాట్ షో కాఫీ విత్ కరణ్ లో సెలబ్రిటీలు మనసులోని మాటలు బైటకొస్తాయి. అక్కడ కమిట్ అవుతారు. బైట మొదలుపెడతారు. విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనే కోరికను వ్యక్తం చేసింది సారా. ఆలియా భట్-రణబీర్ కపూర్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, దీపికా పదుకొనే-రణ్వీర్ సింగ్ కాఫీ షో ఒకరికొకరు తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు, జంటగా మారారు. ఈ లెక్కన విజయ్ దేవరకొండకూడా సారాతో రొమాన్స్ మొదలుపెడతాడా?
కార్తీక్ ఆర్యన్‌తో రొమాన్స్ చేయడానికి ముందు సారా అలీ ఖాన్ తన ఇష్టాన్ని కాఫీ విత్ కరణ్ షోలోనే బైటపెట్టింది. లవ్ ఆజ్ కల్ మూవీ షూటింగ్ సమయంలో వాళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారు. సినిమా ఫ్లాప్ తర్వాత విడిపోయారు.
ఇక రణబీర్ కపూర్ అంటే అలియా భట్ కు ఆల్ టైమ్ క్రష్. నువ్వు ఎవరితో డేటింగ్ చేద్దామనుకొంటున్నావని అడిగితే రణబీర్ పేరునే చెప్పేది అలియా. ఇద్దరూ ఐదేళ్ల డేటింగ్ తర్వాత, ముంబై గాసిప్ సైట్లలో వీళ్ల వ్యవహారం అరిగిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నారు.
కాఫీ విత్ కరణ్ షోలోనే తానూ తానూ, విక్కీ కౌశల్ కలిస్తే చూడటానికి హాట్ కపుల్ గా కనిపిస్తామని కత్రినా కైఫ్ కాఫీ సోఫాలో ఒప్పుకుంది. ఇప్పుడు ఇద్దరూ పెల్లి చేసుకున్నారు.
కిల్, హుకప్, మ్యారీ గేమ్‌లో, రణవీర్ సింగ్ దీపికా పదుకొణెని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అప్పుడు దీపికా తప్ప మరోకరి పేరు అతని నోటి వెంటరాలేదు. చెప్పినట్లే పెళ్లిచేసుకున్నాడు.
ఇక మలైకా అరోరాకు అర్జున్ కపూర్ అంటే ఇష్టం. ఆ ఇంట్రెస్ట్ ను ఎప్పుడూ దాచుకోలేదు. Best Male Performance on Koffee Awards కోసం అర్జున్ కపూర్‌ని ఎంపిక చేసింది. అప్పుడు స్టేజ్ మీద ఒప్పుకుంది. ఇప్పుడు ఇద్దరూ కలసి తిరుగుతున్నారు.