iDreamPost
android-app
ios-app

భర్తను ఏడుసార్లు అరెస్టు చేయించి.. ప్రతిసారీ జామీను ఇచ్చిన భార్య!

భర్తను ఏడుసార్లు  అరెస్టు చేయించి.. ప్రతిసారీ జామీను ఇచ్చిన భార్య!

భార్యాభర్తల మధ్య  గొడవలు  జరగడం అనేది సర్వసాధారణ విషయం. ఎందుకంటే చిన్నపాటి  గొడవలు  కూడా లేని సంసారం ఎక్కడ ఉండదు.  తమ మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలను పట్టించుకోకుండా.. ఒకరికొక్కరు కలిసి సంసారం అనే నౌకలో హాయిగా జర్నీ చేయాలి. అయితే నేటికాలంలో కొందరు భార్యాభర్తలు మాత్రం నిత్యం గొడవలు పడుతూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకుంటారు. ముఖ్యంగా మహిళలు పోలీస్ స్టేషన్లలో తమ భర్తలపై ఫిర్యాదులు చేస్తుంటారు. అలానే ఒక మహిళ కూడా తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి.. అరెస్టు కూడా చేయించింది. తిరిగి ఆమే.. తన భర్తను జైలు నుంచి  విడిపించింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సార్లు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన ప్రేమ్‌చంద్‌, సోనూల దంపతులు. వీరికి 2001లో వివాహం జరిగింది. పదమూడేళ్లపాటు  వీరి సంసారం హాయిగా సాగింది. ఒకరిపై మరొకరు ఎంతో ప్రేమ, ఆప్యాయతను  చూపించుకున్నారు. ఇలా 13 ఏళ్ల పాటు సాగిన వీరి పచ్చని కాపురానికి ఎవరి దిష్టో తగినట్లుంది. అందుకే 2014 నుంచి వీరి బంధంలో సమస్యలు మొదలయ్యాయి. నిత్యం ఇంట్లో ఇద్దరు గొడవ పడుతుండే వారు. పెద్దలు ఎంత సర్ధి చెప్పిన వారు మాత్రం ఘర్షణ పడటం మానుకోలేదు. చివరకి వారిద్దరి గొడవ పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కింది.

తొలి సారి 2015లో తనపై ప్రేమ్‌చంద్‌ భౌతికదాడికి పాల్పడ్డాడని సోనూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోనూ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిపై గృహహింస కేసు నమోదు చేశారు. ఆ కేసు కోర్టు వరకు చేరి.. సోనూకు ప్రేమ్ చంద్ డబ్బులు చెల్లించాలని కోర్టు తీర్పిచ్చింది.  రోజూవారీ కూలీ అయిన ప్రేమ్‌చంద్‌ కోర్టు తీర్పు షాక్ గురి చేసింది. కోర్టు తీర్పు మేరకు ఆమెకు భరణాన్ని చెల్లించలేకపోవడంతో ప్రేమ్ చంద్ అయిదు నెలలు జైల్లో గడిపాడు. తర్వాత సోనూనే అతడిని జామీను ఇచ్చి విడిపించింది. ఇంటికి వచ్చిన తరువాత మళ్లీ గొడవ పడ్డారు. ఇలా మొత్తం ఏడుసార్లు ప్రేమ్ చంద్ జైలుకు వెళ్లాడు.

గత ఏడెనిమిదేళ్లుగా ఇలా అరెస్టయిన ప్రతిసారీ మళ్లీ ఆమే అతడికి జామీను ఇచ్చి విడిపించుకు వచ్చింది. చివరిసారిగా జులై 4న ప్రేమ్ చంద్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఏడు సార్లు భార్య తనపై కేసు పెట్టిందని ప్రేమ్ కక్ష పెంచుకున్నాడు. అందుకే ఈ సారి తన భార్య, కుమారుడిపై ప్రేమ్‌చందే ఎదురు ఫిర్యాదు చేశాడు. ఈ విచిత్ర దంపతలను చూసిన స్థానికులు ఆశ్చర్యంవ్యక్తం చేస్తున్నారు. అరెస్టు చేయించడం దేనికి..తిరిగి విడిపించడం దేనికి అంటూ కొందరు అభిప్రాయపడ్డారు. మరి.. ఈ విచిత్ర జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.