iDreamPost
android-app
ios-app

ఆ పని చేశాడని భర్తకు అరగుండు కొట్టించి, ఊరేగించిన భార్య

  • Published Sep 05, 2023 | 3:13 PM Updated Updated Sep 05, 2023 | 3:13 PM
  • Published Sep 05, 2023 | 3:13 PMUpdated Sep 05, 2023 | 3:13 PM
ఆ పని చేశాడని భర్తకు అరగుండు కొట్టించి, ఊరేగించిన భార్య

వివాహేతర సంబంధాలు కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. మనిషి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. బిడ్డల్ని అనాధలుగా మారుస్తున్నాయి. సమాజంలో తలెత్తుకోలేకుండా అవమానాల పాలు చేస్తున్నాయి. పెళ్లినాటి ప్రమాణాలను గాలిలో రాతలు మాదిరి చేస్తున్నాడు భర్త. కట్టుకున్న భార్యను మభ్యపెట్టి మరో స్త్రీతో వివాహేతర సంబంధాలను నెరుపుతున్నాడు. భార్యకు అనుమానం రాకుండా పరాయి స్త్రీతో సరసల్లాపాలు సాగిస్తున్నాడు. రెండిళ్ల పూజారిలా వేషాలు వేస్తూ తన శారీరక అవసరాలను తీర్చుకుంటున్నాడు. అయితే ఎప్పుడోకప్పుడు నిజాలు బయటపడతాయి కదా. నిజం తెలిశాక  కప్పిపుచ్చుతూ..అబద్దాలు అల్లేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే అనుమానం పెరిగిన తర్వాత.. డిటెక్టివ్ మాదిరిగా మారిన భార్య.. అతడిపై నిఘాను ఉంచుతుంది. ఇక రెడ్ హ్యాండెడ్ గా దొరికితే.. పరిస్థితి ఎలా ఉంటాయో ఊహించడం కష్టం.

కేవలం తన భర్త మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో మహిళ దారుణమైన నిర్ణయం తీసుకుంది. భర్తకు, ఆమె ప్రేయసికి ఇద్దరికి అర గుండు కొట్టించి, ఊరేగించి, పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన సత్యసాయి జిల్లాలోని హిందూపురం సమీపాన తిలక్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉటుకూరుకు చెందిన హుస్సేన్‌కు గతంలో నజియా అనే మహిళతో వివాహం అయ్యింది. అయితే కొద్ది కాలంగా తిలక్ నగర్‌కు చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య.. భర్త నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ వినని భర్త ఆమెతో అక్రమ సంబంధం నెరుపుతున్నాడు. దీంతో నజియా,తన కుటుంబ సభ్యులతో కలిసి తిలక్ నగర్ వెళ్లి భర్తను, ఆమె ప్రేయసిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం కుటుంబ సభ్యుల సాయంతో భర్తకు, ప్రేయసికి అరగుండు కొట్టించి, వీధుల్లో తిప్పింది. అనంతరం వీరిద్దరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నజియా రెండేళ్ల క్రితమే భర్తను విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet