iDreamPost
android-app
ios-app

భర్తకు గుడి కట్టి పూజలు చేస్తున్న భార్య.. ఎక్కడో కాదు..!

  • Published Jul 25, 2023 | 9:27 PM Updated Updated Jul 25, 2023 | 9:27 PM
  • Published Jul 25, 2023 | 9:27 PMUpdated Jul 25, 2023 | 9:27 PM
భర్తకు గుడి కట్టి పూజలు చేస్తున్న భార్య.. ఎక్కడో కాదు..!

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు చనిపోతే వారి మరణాన్ని కొందరు అస్సలు జీర్ణించుకోలేరు. ఇక వారి జ్ఞాపకాలు అనునిత్యం తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. కానీ, కొందరు మాత్రం చనిపోయిన వారి పేరు మీద ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ వారిపట్ల ఉన్న ప్రేమను వ్యక్త పరుచుకుంటుంటారు. అచ్చం ఇలాగే ఓ మహిళ మాత్రం.. తన భర్త చనిపోతే ఏకంగా అతడికి గుడి కట్టింది. అంతే కాదు.. ఆ గుడిలో భర్త విగ్రహ పెట్టి పూజలు కూడా చేస్తోంది. ఈ విషయం తెలియడంతో స్థానికులు అంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా?

ఏపీలోని ప్రకాశం జిల్లా పొదిలిలో గురుకుల అంకిరెడ్డి-పద్మావతి దంపతులు నివాసం ఉండేవారు. వీరికి గత 13 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే.. గత ఆరేళ్ల కిందట జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అంకిరెడ్డి మరణించాడు. దీంతో అప్పటి నుంచి భర్త మరణాన్ని తట్టుకోలేని పద్మావతి.. కొన్నాళ్లకు తేరుకుంది. ఇక భర్త పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లింది. ఇదే సమయంలో ఆమెకు ఓ ఐడియా వచ్చింది. అదే భర్తకు గుడి కట్టడం. అనుకున్నదే ఆలస్యం.. పద్మావతి ఇంటి ఆవరణలో ఓ గుడి కట్టి అందులో భర్త విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

ఇంతే కాదండోయ్.. ప్రతీ ఏటా గురు పౌర్ణమికి భర్త విగ్రహానికి పూజలు చేస్తోంది. దీంతో పాటు అతని పేరు అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ విషయం తెలుసుకుని చుట్టు పక్క గ్రామల ప్రజలు ఆమెకు భర్తపై ఉన్న ప్రేమను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదే కాకుండా చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను గుర్తించి స్థానికులు పద్మావతిని అభినందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వీడియో : ఈ ‘పిల్లి’ తెలివి చూస్తే మతి పోతుంది!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom