iDreamPost
iDreamPost
మొత్తం 16 సీట్లకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో మంచి ఫలితాలు రాట్టింది. కాని రాజస్థాన్ లో కాంగ్రెస్ మాత్రం మరో సీటును అదనంగా దక్కించుకుంది. కర్నాటకలో బీజేపీకి ఎడ్జ్ వచ్చింది. మొత్తం నాలుగు సీట్లలో మూడింటిని దక్కించుకుంది. రాజస్థాన్ లో మాత్రం ఎదురుదెబ్బతింది. మహారాష్ట్రలో మూడోసీటు పట్టేసింది. మొత్తం మీద రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మిశ్రమ ఫలితాలే దక్కాయనుకోవాలి.
ఇక మిగిలిన 41 సీట్లకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. వచ్చే నెలలో రాష్ట్రపతి ఎన్నికలున్నందన రాజ్యసభ ఎన్నికలకు ఇంత గిరాకీ.
కాని బీజేపీ నుంచి గెలిచినవారిలో ఏ ఒక్కరూ ముస్లింకారు. ఇప్పటిదాకా రాజ్యసభలో ఉన్న ముగ్గురు ముస్లిం నేతల పదవీకాలం ముగియనుంది. ఎంపీలు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, సయ్యాద్ జాఫర్ ఇస్లాంతోపాటు ఎం.జే. అక్బర్ ల పదవి కాలం జూన్, జులైలో ముగుస్తోంది.
లోక్ సభలో 301 మంది సభ్యల బలమున్నా అందులో ఒక్కరుకూడా ముస్లిం కారు. అసలు ఆ మతనాయకుల టిక్కెట్ ఇవ్వకూడదన్నది సైద్ధాంతికంగా తీసుకున్న నిర్ణయం. ఈనెల 7న నఖ్వీ రాజస్యభకు వీడ్కోలు పలికారు. ఇక ఇస్లాం పదివీకాలం జులై4న ముగుస్తుంది. అక్బర్ ఈనెల 29న రిటైర్ అవుతారు. వాళ్ల ప్లేసులో ముస్లిం నాయకులను బరిలోకి దింపలేదు బీజేపీ. మొత్తం 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ సీట్లకు పోటీపడుతున్న బీజేపీ ఏ ముస్లింనేతనూ బరిలోకి దించలేదు.
ఎందుకని? దేశంలో దాదాపు 15శాతం వరకు ఉన్న ముస్లిం జనాభాకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎందుకు బీజేపీ అనుకోవడంలేదు? నిజానికి బీజేపీకి మైనార్టీ మోర్చా విభాగం ఉంది. దానికి అధ్యక్షుడు జమల్ సిద్ధిఖి. ఇదే ప్రశ్న అయన్ను అడిగితే, తరచుగా వచ్చే సమాధానం ఒక్కటే. ముస్లింనేతలు బీజేపీని కాకుండా వేరే ఇతర పార్టీలను నమ్ముకొంటున్నారని. పాలనలో భాగస్వామ్యం కావాలంటే, రాజకీయంగా ఎదగాలంటే బీజేపీయే నిఖార్సైన వేదికని ఆయన గొప్పగా చెప్పుకొంటారు. అసలు నఖ్వీ, జాఫర్ లు వాళ్ల ప్రతిభ వల్ల రాజ్యసభకు వెళ్లివాళ్లేకాని, వాళ్ల మతాన్ని బట్టి బీజేపీ ఆ అవకాశం ఇవ్వలేదని అంటారు. నఖ్వీ మొదటి నుంచి పార్టీకి అగ్రనేత. సందేహంలేదు. ఇక జాఫర్ అంటే ఆర్ధికశాస్త్రం తెలిసిన నిపుణుడు. అందుకే ఆయనకు అవకాశమిచ్చారు. ఎంజే అక్బర్ గొప్ప జర్నలిస్ట్ కాబట్టే రాజ్యసభకు బీజేపీ పంపించిందికాని, వాళ్ల మతవిశ్వాసాన్ని బట్టి కాదని సిద్ధిఖీతోపాటు చాలామంది బీజేపీ మైనార్టీ నేతలు చెబుతుంటారు.
మరి ముస్లింల ప్రతినిధిగా ఒక్కరినైనా ఎందుకు పార్లమెంట్ కు బీజేపీ పంపించలేదు? దీనికి బీజేపీ ఇచ్చిన సమాధాం ఒక్కటే. మతాన్ని బట్టికాదు, ప్రతిభను బట్టి, సామాజిక స్థితిగతులను బట్టే సభ్యుల ఎంపిక ఉంటుది. పార్టీలో ముస్లిం ప్రాతినిధ్యం లేదంటు పార్టీ ఒప్పుకోదు.
ప్రస్తుతానికి బీజేపీ చెప్పిన మాటలు కొన్ని వర్గాలకు నచ్చుతున్నా, వీరాభిమానులు మెచ్చుకొంటున్నా, పార్లమెంట్ లో అధికార పార్టీకి ముస్లిం ప్రాతినిధ్యం లేకపోవడం భవిష్యత్తులో ఇబ్బందులను తెచ్చిపెట్టొచ్చు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కనీసం 20 మంది ముస్లిం నేతలకు అవకాశమివ్వాలని బీజేపీలో కొందరు నేతలు ప్రతిపాదించారు. కాని బీజేపీ మాత్రం, 2017 తరహాలోనే, ఏ ఒక్క ముస్లిం నేతను ఎన్నికల్లో నిలబెట్టలేదు. మిత్ర పక్షం అప్పాదళ్ మాత్రం ఒక్కరిని నిలబెట్టినా హైదర్ ఆలీ ఓడిపోయారు.
ప్రతి మంత్రివర్గంలోనూ మైనార్టీ సంక్షేమ శాఖ అంటూ ఒకటి ఉంటుంది. దానికి మంత్రి కావాలి కదా? 2017లో యోగి మంత్రివర్గంలో ఈ శాఖా మంత్రి మోసిన్ రాజా. రెండోసారి అదే ప్రభుత్వం వచ్చాక అజాద్ అన్సారీ ఆ బాధ్యతలను చేపట్టారు. కాకపోతే ఈ ఇద్దరు అసెంబ్లీకి ఎన్నికైనవాళ్లుకాదు, మండలి రూట్ లోంచి కేబినేట్ కి వచ్చినవాళ్లు.