iDreamPost
android-app
ios-app

ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద పరదా సందడి

  • Published Aug 18, 2025 | 10:58 AM Updated Updated Aug 18, 2025 | 10:58 AM

ఆగస్టు నెల మొత్తం టాలీవుడ్ థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం నెలకొననుంది. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆయా సినిమాలను నెత్తిన పెట్టుకుని చూసుకుంటారన్న సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు జరుగుతుంది కూడా.

ఆగస్టు నెల మొత్తం టాలీవుడ్ థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం నెలకొననుంది. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆయా సినిమాలను నెత్తిన పెట్టుకుని చూసుకుంటారన్న సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు జరుగుతుంది కూడా.

  • Published Aug 18, 2025 | 10:58 AMUpdated Aug 18, 2025 | 10:58 AM
ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద పరదా సందడి

ఆగస్టు నెల మొత్తం టాలీవుడ్ థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం నెలకొననుంది. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆయా సినిమాలను నెత్తిన పెట్టుకుని చూసుకుంటారన్న సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు జరుగుతుంది కూడా. మొన్న వీకెండ్ వార్ 2, కూలీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేశాయి కానీ వాటిలో కూలీ సినిమాకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక వీక్ డే టెస్ట్ లో ఈ రెండు సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటాయో చూడాలి. ఇక ఈ వీకెండ్ కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి.

అనుపమ పరమేశ్వరన్ పరదా , మేఘాలు చెప్పిన ప్రేమ‌క‌థ‌, బార్బ‌రిక్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో ప్రేక్షకుల మొదటి ఛాయస్ అయితే పరదా సినిమానే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ కాస్త యూనిక్ గా ఉంది. స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమానే అని ట్రైలర్ చూస్తే చెప్పేయొచ్చు. అందులోను ఫిమేల్ సెంట్రిక్ మూవీ. మరి ఏ మాత్రం టాక్ సంపాదించుకుంటుందో చూడాలి. స‌త్యరాజ్‌, ఉద‌య‌భాను ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ‘బార్బ‌రిక్’ ట్రైలర్ కూడా బాగానే ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ఇస్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు. కానీ ఎంతవరకు థియేటర్స్ కు ప్రేక్షకులను పుల్ చేయగలుగుతాయి అనేది తెలియాలంటే మాత్రం ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

ఈ మధ్య కాలంలో మహా అయితే మొదటి వీకెండ్ కు మించి ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించలేకపోతున్నాయి. చాలా మంది ఓటిటి లకు అలవాటు పడిపోతున్నారు. టాక్ సూపర్ డూపర్ హిట్ ఉంటె తప్ప థియేటర్స్ కు కదలడం లేదు. టాక్ ఏ మాత్రం అటు ఇటుగా ఉన్నా ఓటిటి లకు ఎంట్రీ ఇచ్చినప్పుడు వాటిని చూస్తున్నారు. కనీసం ఈ వీకెండ్ వచ్చే సినిమాలైనా ప్రేక్షకులను మెప్పిస్తే అదే చాలని అనుకుంటున్నారు థియేటర్ ఓనర్స్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.