iDreamPost
android-app
ios-app

ఈ రెండిటికి అసలు టెస్ట్ ఈరోజే !

  • Published Aug 18, 2025 | 10:13 AM Updated Updated Aug 18, 2025 | 10:13 AM

వార్ 2 , కూలీ సినిమాలా పుణ్యమా అని లాంగ్ వీకెండ్ గడిచిపోయింది. మొదటి రోజు రెండు సినిమాలకు మిక్సెడ్ టాక్ లభించినా కానీ.. రెండో రోజుకి అసలు విన్నర్ ఎవరో తేలిపోయింది. రెండు సినిమాలను కంపేర్ చేసుకుంటే కూలీకె ఎక్కువ ఓట్లు వేశారు ప్రేక్షకులు. అటు నార్త్ లో మాత్రం వార్ 2 దుమ్ము దులిపేస్తుంది.

వార్ 2 , కూలీ సినిమాలా పుణ్యమా అని లాంగ్ వీకెండ్ గడిచిపోయింది. మొదటి రోజు రెండు సినిమాలకు మిక్సెడ్ టాక్ లభించినా కానీ.. రెండో రోజుకి అసలు విన్నర్ ఎవరో తేలిపోయింది. రెండు సినిమాలను కంపేర్ చేసుకుంటే కూలీకె ఎక్కువ ఓట్లు వేశారు ప్రేక్షకులు. అటు నార్త్ లో మాత్రం వార్ 2 దుమ్ము దులిపేస్తుంది.

  • Published Aug 18, 2025 | 10:13 AMUpdated Aug 18, 2025 | 10:13 AM
ఈ రెండిటికి అసలు టెస్ట్ ఈరోజే !

వార్ 2 , కూలీ సినిమాలా పుణ్యమా అని లాంగ్ వీకెండ్ గడిచిపోయింది. మొదటి రోజు రెండు సినిమాలకు మిక్సెడ్ టాక్ లభించినా కానీ.. రెండో రోజుకి అసలు విన్నర్ ఎవరో తేలిపోయింది. రెండు సినిమాలను కంపేర్ చేసుకుంటే కూలీకె ఎక్కువ ఓట్లు వేశారు ప్రేక్షకులు. అటు నార్త్ లో మాత్రం వార్ 2 దుమ్ము దులిపేస్తుంది. కానీ సౌత్ లో మాత్రం కేవలం ఎన్టీఆర్ కోసం థియేటర్స్ కు కదులుతున్నారని టాక్.వీకెండ్ వరకు రెండు సినిమాలు పోటా పోటీగా బాగానే రేస్ లో పార్టిసిపేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాలకు అసలు టెస్ట్ మొదలుకానుంది.

ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినా చాలా సినిమాలకు.. వాటి లైఫ్ స్పాన్ కేవలం వీకెండ్ వరకే ఉంటుంది. అది ఎంత పెద్ద సినిమా అయినా సరే రావాల్సిన వసూళ్లు వీక్ డే మొదలైన దగ్గరనుంచి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అందుకే మండే వస్తుందంటే చాలు థియేటర్ ఓనర్లు భయపడుతున్నారు. ఈ వీక్ డే టెస్ట్ కనుక పాస్ అయితే సినిమా కలెక్షన్స్ కు లోటు ఉండదు. ఇప్పటికే కూలీ ఓవరాల్ గా సుమారు రూ.300 కోట్లకు పైగా రాబట్టింది. వార్ 2 కూడా మొదట్లో అటు ఇటుగా ఉన్నా.. మెల్లగా కాస్త వేగం పుంజుకుంది. ఈ సినిమా కూడా దాదాపు రూ.200 కోట్లకు దగ్గరగానే రాబట్టిందట.

ఇంతవరకు బాగానే ఉంది. తెలుగులో కూలీలే సినిమా ఇప్పటికి యావ‌రేజ్‌గా 60-70శాతం మ‌ధ్య రిక‌వ‌రీ రాబట్టిందట. ఇప్పుడు వీక్ డేస్ లో కూడా కాస్త చెప్పుకోదగిన వసూళ్లు రాబడితే కూలీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. అయితే ఇన్ని కొత్త సినిమాలు వచ్చినా కూడా మహావతారా నరసింహ జోరు మాత్రం తగ్గడం లేదు. ఇంకా ఈ సినిమా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. ఇక ఇంకెన్ని డేస్ ఇది కొనసాగుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.