iDreamPost
android-app
ios-app

దుర్గి ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ రాజకీయాల వెనుక అసలు లక్ష్యాలేంటి

  • Published Jan 03, 2022 | 12:49 PM Updated Updated Mar 11, 2022 | 10:27 PM
దుర్గి ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ రాజకీయాల వెనుక అసలు లక్ష్యాలేంటి

ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చిన్న ఘటన జరిగినా దానిని రాజకీయం చేసి లబ్ధిపొందాలనే సంకల్పంతో టీడీపీ ఉంది. కానీ పరిస్థితులు దానికి భిన్నంగా ఉండడంతో ఆ పార్టీ రానురాను కుదేలవుతోంది. అయినప్పటికీ ఏదో అలజడి సృష్టించాలనే యత్నం మాత్రం కొనసాగిస్తోంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహంపై మద్యం మత్తులో కొందరు చేసిన దాడియత్నాన్ని తనకు అనువుగా మార్చుకోవాలని యత్నిస్తోంది. నిజానికి దుర్గి ఘటనను అందరూ ఖండించారు. అధికార పార్టీ నేతలే తొలుత స్పందించారు. దానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా కదిలింది. స్వల్ప సమయంలోనే పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయినా టీడీపీ నేతలు రాజకీయయత్నాలు మాత్రం ఆగలేదు.

గరగపర్రులో అంబేద్కర్ విగ్రహం విషయంలో చంద్రబాబు హయాంలో ఎంత ఆందోళన సాగిందో అందరికీ తెలుసు. విజయవాడలో వైఎస్సార్ విగ్రహాన్ని టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో రాష్ట్రమంతా చూసింది. కానీ ఇప్పుడు ఓ మారుమూల గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఏదో జరిగిపోయిందంటూ టీడీపీ నేతల హంగామా ఆశ్చర్యంగా కనిపిస్తోంది. అంతకుమించి వారి నైజం చాటుతోంది. టీడీపీ ఆతృత చూస్తుంటే ఎన్టీఆర్ విగ్రహానికి ఏదో జరిగిందనే బాధ కన్నా తమకు ఈ ఘటన రాజకీయంగా ఏమేరకు ఉపయోగపడుతుందోననే కంగారు ఎక్కువగా కనిపిస్తోంది.

మాచర్ల రాజకీయం రెండు దశాబ్దాలుగా చంద్రబాబుకి మింగుడుపడడం లేదు. ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి గట్టి పట్టు ఉండడంతో బాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. ఈసారి మాత్రం ఏదోరకంగా మాచర్లలో గట్టెక్కాలని, పిన్నెల్లికి అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు చాలా స్కెచ్ లు వేస్తున్నారు. కొంతకాలం క్రితం ఆత్మకూరులో వెలివేశారంటూ నానా హడావిడి చేసి ఎన్ హెచ్ ఆర్ సీ వరకూ వెళ్ళారు. కానీ స్థానికంగా గ్రామ రాజకీయాలతో జరిగిన ఈ పరిణామాలను ఏపీ ప్రభుత్వానికి ముడిపెట్టాలని చేసిన యత్నాలు ఫలించకపోవడంతో బాబు హంగామా అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది.

ఇటీవల మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి బ్రహ్మారెడ్డిని ఇన్ఛార్జ్ గా టీడీపీ ప్రకటించింది.దాంతో ఆయన ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని మద్యం మత్తులో కొందరు చేసిన ఘటనకు రాజకీయ రంగు పులిమే యత్నం సాగించింది. నిందితుడిని అరెస్ట్ చేసి, ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వ పెద్దలే ఖండించిన తర్వాత టీడీపీ నేతల విమర్శలేమిటో అర్థం కాదు. పైగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇదో దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టీడీపీ నేతలు మాత్రం నోటికి పనిచెబుతూ ఏదో ఆశిస్తున్న తీరు ఆశ్చర్యంగా కనిపించకమానదు.

Also Read : అధికారానికి దూరమయినంత మాత్రాన సామాన్య ప్రజలను ఇంతగా అవమానించాలా రాధాకృష్ణా?