iDreamPost
android-app
ios-app

నయనతార పెళ్ళికి సమంత వెళ్లట్లేదా??

  • Published Jun 08, 2022 | 8:00 PM Updated Updated Jun 08, 2022 | 8:00 PM
  • Published Jun 08, 2022 | 8:00 PMUpdated Jun 08, 2022 | 8:00 PM
నయనతార పెళ్ళికి సమంత వెళ్లట్లేదా??

లేడీ సూపర్ స్టార్ నయనతార తన ప్రియుడు డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీళ్ళు గతంలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అప్పట్నుంచి దేశంలోని అన్ని ప్రముఖ గుళ్ళు తిరిగేస్తున్నారు. పార్టీలు, పండగలు కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారు. వీరి పెళ్లిపై అనేక వార్తలు వచ్చినా స్పందించలేదు. కానీ ఈ జూన్ 9న వివాహం చేసుకోబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు.

నయనతార విగ్నేష్ వివాహం మహాబలిపురంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో జూన్ 9 ఉదయం జరగనుంది. ఈ పెళ్ళికి అనేకమంది సౌత్ సెలబ్రిటీలను పిలిచారు. పలువురు సౌత్ సెలబ్రిటీలు ఈ పెళ్ళికి హాజరవనున్నారు. అయితే ఈ పెళ్ళికి సమంత వెళ్లట్లేదని తెలుస్తుంది. సమంత, నయనతార మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ కలిసి ఇటీవలే విజయ్ సేతుపతి సరసన కాతువాకల్ రెండు కాదల్ సినిమాలో నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నారు. పార్టీలు సెలబ్రేట్ చేసుకున్నారు. నయనతార బర్త్ డేకి కూడా అర్ధరాత్రి స్పెషల్ సర్ ప్రైజ్ పార్టీలో పాల్గొంది సమంత. వీరిద్దరూ అంత క్లోజ్ ఫ్రెండ్స్.

కానీ సమంత నయనతార పెళ్ళికి వెళ్లట్లేదని సమాచారం. సమంత చైతూతో విడిపోయిన తర్వాత కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్టులు ఒప్పుకొని షూట్స్ తో ఫుల్ బిజీగా ఉంది సమంత. ఒకేసారి రెండు, మూడు ప్రాజెక్టు షూట్స్ లో పాల్గొంటుంది సమంత. దీంతో సమంత డేట్స్ ఫుల్ టైట్ గా ఉన్నాయని సమాచారం. ఇటీవలే విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషి సినిమా ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి చేసుకొని వచ్చింది. తాజాగా ఖుషి రెండో షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో మొదలవబోతున్నట్టు సమాచారం. దీంతో నయనతార పెళ్లి రోజు సమంత షూట్ లో ఉంటుందని తెలుస్తుంది. ఒకవేళ పెళ్ళికి వెళ్లకపోయినా తర్వాత వెళ్లి పర్సనల్ గా కలుస్తుంది సమంత అని సన్నిహితులు చెప్తున్నారు.

 

 

Jojobet GirişjojobetjojobetMadridbetJojobetjojobetJojobetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet