iDreamPost
android-app
ios-app

భూమి లోపల ఏం జరుగుతుంది? ఇండియా, జపాన్, తైవాన్, అమెరికా.. ఇన్ని భూకంపాలా?

  • Published Apr 06, 2024 | 2:21 PM Updated Updated Apr 06, 2024 | 2:21 PM

ప్రపంచంలో వరుస భూకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి వెంట వెంటనే ఇలాంటి వార్తలను వింటూ వస్తున్నాము. అసలు దీనికి గల కారణాలేంటి భూమి లోపల ఏం జరుగుతోంది అనే సందేహాలు మొదలయ్యాయి.

ప్రపంచంలో వరుస భూకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి వెంట వెంటనే ఇలాంటి వార్తలను వింటూ వస్తున్నాము. అసలు దీనికి గల కారణాలేంటి భూమి లోపల ఏం జరుగుతోంది అనే సందేహాలు మొదలయ్యాయి.

  • Published Apr 06, 2024 | 2:21 PMUpdated Apr 06, 2024 | 2:21 PM
భూమి లోపల ఏం జరుగుతుంది? ఇండియా, జపాన్, తైవాన్, అమెరికా.. ఇన్ని భూకంపాలా?

మొన్న జపాన్ లోని తైవాన్ , నిన్న అమెరికా ఇలా వరుసగా ఒక దాని తర్వాత ఒకటిగా భూకంపాలు సంభవిస్తూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ లోని పాలిలో కూడా భూకంపం సంభవించింది. అర్ధరాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో భయంతో ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే ఇక్కడ అంత తీవ్రతతో భూమి కంపించకపోవడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అలాగే హిమాచల్ లో కూడా భూకంపం సంభవించింది. అసలు వరుసగా ఇలా భూకంపాలు సంభవించడానికి గల కారణాలు ఏమై ఉంటాయి. అసలు భూమి లోపల ఏం జరుగుతోంది అనే సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు చెప్పిన ప్రదేశాలతో పాటు.. మరికొన్ని ప్రదేశాలలో కూడా భూకంపాలు సంభవించాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ లోని పాలిలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. అలాగే,న్యూయార్క్ నగరం , ఉత్తర న్యూజెర్సీ చుట్టూ కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. అక్కడ నుంచి అందిన సమాచారం ప్రకారం న్యూజెర్సీలో భూకంప తీవ్రత 4.0 గా నమోదు అయింది. అక్కడ పలు ప్రాంతాల్లోభూమి కంపించింది. ప్రజలంతా తీవ్ర భయాందోళనకు అయితే గురి అయ్యారు కానీ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మాత్రం జరుగలేదు. దీనితో పాటు.. ఉత్తర కాలిఫోర్నియాలో కూడా భూకంపం సంభవించింది. అక్కడ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4 గా నమోదయ్యింది. అయితే ఈ భూకంపం ఒకటి రెండు సార్లు కాకుండా వేరు వేరు సమయాల్లో ఏకంగా ఏడు సార్లు భూకంపం సంభవించింది. ఇక శుక్రవారం మయన్మార్‌లో కూడా భూకంపం సంభవించింది. అక్కడ రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది.

ఇక మూడు రోజుల క్రితం తైవాన్‌లో సంభవించిన భారీ భూకంపం గురించి ఇప్పటికి ఎన్నో వార్తలను వింటూ వస్తున్నాం. గత 25 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఇంత తీవ్రతతో భూమి కంపించలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అక్కడ జరిగిన ఘటనలో మాత్రం చాలా మంది చనిపోయారు. అలానే, భారీ భవనాలు నేల మట్టం అయ్యాయి. తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. ఇప్పటికి కూడా అక్కడ పరిస్థితులు ఇంకా సర్దుమణగలేదు. అంతే కాకుండా వీటి అన్నిటితో పాటు భారత్ లోను పలు ప్రాంతాల్లో భూకంపాలు వచ్చాయి. దీనితో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అసలు భూమి లోపల ఏం జరుగుతోంది ! ఎందుకు వరుస భూకంపాలు సంభవిస్తున్నాయనే ప్రశ్నలు ఇప్పుడు అందరిని కలచివేస్తున్నాయి.

అయితే అసలు భూకంపాలు సంభవించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. పర్యావరణానికి జరుగుతున్న నష్టం. పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఉన్న నీటి వ‌ల్ల‌, అధికమైన భూగ‌ర్భ జ‌లాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయ‌డం, అడవుల్లో చెట్ల‌ను న‌రికివేయ‌డం వంటి వ‌ల్ల భూకంపాలు వ‌చ్చే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయంటు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాజెక్టుల్లో ఉన్న వందలాది ఘనపు మైళ్ల నీటి ఒత్తిడి భూమిపై పడటం వలన.. భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న సమయంలో.. భూమి అంతర్గత పొరల్లో సర్దుబాట్ల సమయంలో జరిగే ఫలితమే ఈ భూ ప్రకంపనల అంటే భూకంపాలకు కారణం అని.. శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.