iDreamPost
iDreamPost
రానా, సాయి పల్లవి జంటగా, ప్రియమణి, నవీన్ చంద్ర ముఖ్యపాత్రల్లో విరాటపర్వం సినిమా రాబోతుంది. వేణు ఉడుగుల ఈ సినిమాని డైరెక్ట్ చేయగా సుధాకర్ చెరుకూరి, రానా కలిసి నిర్మించారు. నక్సల్స్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుంది. ఇప్పటికే అనేక వాయిదాల అనంతరం జూన్ 17న రిలీజ్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. డైరెక్టర్, రానా, సాయి పల్లవి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ జనాలకి విపరీతంగా నచ్చేసి సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ట్రైలర్ చూసిన తర్వాత సాయి పల్లవి యాక్టింగ్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. హీరో, డైరెక్టర్ కూడా ఈ సినిమాలో మెయిన్ లీడ్ సాయి పల్లవి అని, తన చుట్టే కథ తిరుగుతుందని ప్రకటించారు. ఇక సాయి పల్లవి క్రేజ్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
తాజాగా డైరెక్టర్ వేణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు విషయాలని తెలియచేశాడు. అలాగే సినిమాకి విరాట పర్వం అనే పేరే ఎందుకు పెట్టాడో తెలిపాడు. వేణు మాట్లాడుతూ.. ఈ సినిమాని రానా, సాయి పల్లవి, సురేష్ బాబు… అందరూ ఒక్క సిటింగ్ లోనే ఓకే చేసేశారు. కరోనా వల్ల ఈ సినిమా లేట్ అయింది. నిజ జీవితంలో జరిగిన కొన్ని పాత్రలని తీసుకొని రాసుకున్న ఫిక్షన్ స్టోరీ ఇది. నక్సల్స్, ప్రేమ రెండు విభిన్న సిద్ధాంతాలని కలిపి ఒకే చోట భావోద్వేగాలతో చూపించాము. ఈ సినిమా అందరికి నచ్చుతుంది. మహాభారతంలో విరాటపర్వం అనేది ఓ అండర్ గ్రౌండ్ స్టోరీ. అందులో ఉన్న కుట్రలు, రాజకీయ ఫిలాసఫీ, ప్రేమలు ఈ చిత్రానికి సరిగ్గా సరిపోతాయని అనిపించి ఆ టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ కి కూడా అంతా ఓకే చెప్పారు అని తెలిపాడు.