iDreamPost
android-app
ios-app

ఉత్తర కొరియా తదుపరి సారధి ఎవరు…?

ఉత్తర కొరియా తదుపరి సారధి ఎవరు…?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమించిందనే ప్రచారం నేపథ్యంలో ఆయన స్థానం ఎవరూ భర్తీ చేస్తారు..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉత్తరకొరియా ఏర్పడినప్పటి నుంచి కిమ్ కుటుంబమే ఆ దేశాన్ని పాలిస్తోంది. ఆ కుటుంబంలో కిమ్ జాంగ్ ఉన్ మూడో తరానికి చెందిన వ్యక్తి. ఉత్తర కొరియాకు.. తన దాయాది దక్షిణ కొరియా తో పాటు, అగ్రరాజ్యం అమెరికా తోనూ విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశాన్ని శత్రువుల బారి నుంచి రక్షిస్తూ.. పరిపాలన సాగించిన గల శక్తి సామర్ధ్యాలు ఉన్న వ్యక్తి ఎవరు అన్నదానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే కిమ్ జాంగ్ ఉన్ వారసత్వాన్ని ఆమె సోదరి కిమ్ యో జాంగ్ అందిపుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దేశం పై కిమ్ యో జాంగ్ పూర్తిగా పట్టు సాధించారని సమాచారం. అచ్చం కిమ్ జాంగ్ ఉన్ లక్షణాలనే  ఆయన చెల్లెలు  యో జాంగ్ వంటబట్టించుకున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కిమ్ వంశంలో కిమ్ జాంగ్ ఉన్ తర్వాత అంతటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిగా ఆయన సోదరి యో జాంగ్ గుర్తింపు పొందారు. గత నెలలో దక్షిణ కొరియా చేపట్టిన మిలిటరీ విన్యాసాలు సందర్భంగా యో జాంగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భయపడిన కుక్క మొరుగుతుంది.. అంటూ దక్షిణకొరియా ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేయడంతోనే కిమ్ సోదరి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.

తనలాగే తన చెల్లిని కూడా కిమ్ జాంగ్ ఉన్ తీర్చిదిద్దారు. తన తర్వాత దేశాన్ని పాలించే సత్తా కింగ్ యో జాంగ్ కు ఉందని గుర్తించిన కిమ్ జాంగ్ ఉన్.. ఆమెను తీర్చిదిద్దారు. దక్షిణ కొరియా, అమెరికాలతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై కొన్నేళ్లుగా కిమ్.. తన సోదరికి శిక్షణ ఇస్తున్నారని సమాచారం. 36 ఏళ్ల కిమ్ చైన్ స్మోకర్.. పైగా ఊబకాయం. ఈ నేపథ్యంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆయన తాత, తండ్రి కూడా ఉభకాయులే. వారిద్దరూ గుండె పోటు తో మరణించారు.