iDreamPost
android-app
ios-app

Ratan Tata: రతన్ టాటాకు అత్యంత ఆప్తుడు.. అసలు ఎవరు ఈ శంతను నాయుడు?

  • Published Oct 10, 2024 | 3:20 PM Updated Updated Oct 10, 2024 | 3:20 PM

Ratan Tata: రతన్ టాటాకు అత్యంత ఆప్తుడు శంతను నాయుడు. టాటా వెంట నీడల అనునిత్యం ఉంటాడు.

Ratan Tata: రతన్ టాటాకు అత్యంత ఆప్తుడు శంతను నాయుడు. టాటా వెంట నీడల అనునిత్యం ఉంటాడు.

Ratan Tata: రతన్ టాటాకు అత్యంత ఆప్తుడు.. అసలు ఎవరు ఈ శంతను నాయుడు?

ఫేమస్ బిజినెస్ మ్యాన్ టాటా గ్రూప్‌ చైర్మన్‌ రతన్‌ టాటా మరణం యావత్తు ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రతన్‌ టాటా చనిపోవడంతో పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార రంగంతోపాటు దాతృత్వంలో ఆయన సేవలు అమోఘమనే చెప్పాలి. ఇప్పుడు ఆయన సేవలన్నిటిని కూడా అందరూ గుర్తు చేసుకుంటున్నారు. రతన్ టాటాది జాలి గుణం. ఆయన ఎవరిలో అయిన ప్రతిభని గుర్తిస్తే వారిని అస్సలు మరిచిపోరు. ఆయనకి నచ్చితే చాలు వారికి కచ్చితంగా అవకాశం ఇస్తారు. రతన్‌ టాటాకు చాలా ఇష్టమైన వ్యక్తి శంతను నాయుడు. ఇతను టాటాకు అత్యంత ఆప్తుడు, టాటా ట్రస్ట్‌లో అతి పిన్న వయస్కుడు. టాటాకు జనరల్‌ మేనేజర్‌గా, అసిస్టెంట్‌గా వ్యవహరించాడు శంతను నాయుడు. తనకు ఎంతో ఇష్టమైన టాటా చనిపోవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘గుడ్‌ బై మై డియర్‌ లైట్‌హౌస్‌’ అంటూ తన కన్నీటి వీడ్కోలు పలికారు. మీరు చనిపోవడంతో మన స్నేహంలో శూన్యం మిగిలింది. మీరు లేని లోటును అధిగమించేందుకు నా జీవితాంతం ప్రయత్నిస్తాను. మీ ప్రేమ నాకు దూరమవడంతో కలుగుతోన్న దుఃఖం పూడ్చలేనిది. గుడ్‌ బై.. మై డియర్‌ లైట్‌హౌస్‌’ అంటూ శంతను ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గతంలో తీసుకున్న ఫొటోలను కూడా షేర్‌ చేశాడు శంతను. ప్రస్తుతం ఈ ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. అసలు ఇంతకీ ఈ శంతను నాయుడు ఎవరు? టాటాకి ఇంత ఇష్టమైన వ్యక్తిగా ఎలా నిలిచాడు? అతని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఒకరోజు, ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నప్పుడు ఓ విషాద ఘటన చూశాడు శంతను. అప్పుడు ఓ కుక్క రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చూశాడు. ఆ సంఘటన అతన్ని ఎంతగానో బాధ పెట్టింది. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఫిక్స్ అయ్యాడు. తనఫ్రెండ్స్ తో కలిసి రంగురంగుల రేడియం బెల్ట్‌లను డిజైన్ చేశాడు. ఈ బెల్ట్‌ తో కుక్క రోడ్డు మీదికి వెళ్లినప్పుడు.. బెల్టులోని కలర్స్ వెహికల్స్ హెడ్‌లైట్స్‌కు మెరిసిపోతాయి. వాటిని చూసి కార్లు నడిపేవారు జాగ్రత్త పడతారు. అందువలన ఆ మూగజీవాలకు ఎలాంటి ప్రమాదం జరగదు. ఆ తరువాత చాలామంది అలాంటి బెల్టులని కావాలన్నారు.అయితే, శంతను దగ్గర వాటిని తయారు చేయడానికి కావాల్సినంత డబ్బు లేదు. తండ్రి సలహాతో ఫండ్స్ కోసం టాటా ఇండస్ట్రీస్‌కు లేఖ రాశాడు. దాంతో ముంబైకి రమ్మంటూ వాళ్లు అతనికి ఆహ్వానం పంపారు. వెంటనే ఈ ప్రాజెక్టుకు ఫండ్స్ ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. అలా శంతను ‘మోటోపాస్‌’ అనే స్టార్టప్‌ను స్టార్ట్ చేశాడు. అలా శంతను జాలి గుణానికి, ఐడియాలజీకి, టాలెంట్ కి ఇంప్రెస్ అయ్యాడు టాటా. అప్పటి నుంచి అతన్ని తన వెంట పెట్టుకున్నారు. అలా వీరిద్దరిని ఆ మూగజీవాలు కలిపాయి.

ఇలా 80 ఏళ్ల రతన్‌ టాటాకు.. ఈ 30 ఏళ్ల శంతను నాయుడుతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. 2018 నుంచి రతన్‌ టాటాకు శంతను అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. రతన్ టాటా శంతను నాయుడిని సొంత మనవడిలా చూసుకున్నారు. రతన్‌ టాటా, శంతను మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నా కానీ అది వారి మధ్య స్నేహానికి, వ్యాపారానికి ఏమాత్రం అడ్డు రాలేదు. మంచి ఫ్రెండ్షిప్ వీరిద్దరి మధ్య ఉంది. వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూసి అందరూ ఆశ్చర్య పోతారు. అంతలా వీరిద్దరూ కనెక్ట్ అయ్యారు. రతన్‌ టాటా ఓ లెజెండ్. ప్రపంచ కుబేరులు సైతం ఆయన్నీ కలిస్తే చాలు అనుకుంటారు. అలాంటి వ్యాపార దిగ్గజం భుజంపై చేయి వేసి ‘ఇంకేంటి డ్యూడ్‌! ’ అంటూ ఆప్యాయంగా పలకరించేంత చనువు, స్నేహం కేవలం శంతనుకు మాత్రమే ఉంది. రతన్‌ సేవా కార్యక్రమాలు, ఆయన సోషల్‌ మీడియా ఖాతాల వెనుక ఈ 30 ఏళ్ల యువకుడి కృషి ఎంతో ఉంది. టాటాకు నీడలా అనునిత్యం ఆయనతోనే ఉంటారు. టాటా చేసే సేవా కార్యక్రమాల వెనకాల శంతను నాయుడు ప్రతిభా నైపుణ్యాలు ఎన్నో ఉన్నాయి. అందుకే టాటా డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (ఛైర్మన్‌ ఆఫీస్‌)గా వ్యవహారాలు చూసుకుంటున్నాడు శంతను నాయుడు.

సేవా కార్యక్రమాల గురించి ఇద్దరూ ఎప్పుడూ చర్చించుకునేవారు. ఈమెయిల్స్‌ ద్వారా తమ అభిప్రాయాలు పంచుకునేవారు. అసలు రతన్‌ టాటాకు సోషల్‌ మీడియా గురించి నేర్పించింది కూడా శంతనునే. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, హ్యాష్‌ ట్యాగ్‌, ఎమోజీలు వాడటం.. ఇంకా సోషల్ మీడియాలోని మెలకువలన్నీ కూడా రతన్‌ టాటాకు నేర్పించాడు శంతను నాయుడు. దానితో పాటుగా వ్యాపారానికి సంబంధించి రతన్‌కు ఎన్నో విలువైన సలహాలు కూడా అందిస్తూ నమ్మకంగా ఉండేవాడు.మెటోపాస్‌ కంపెనీ పనులను చూసుకుంటూనే, చదువుల కోసం అమెరికా వెళ్లాడు శంతను. అతను చదువుకుంటున్న కార్నెల్‌ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్‌ వేడుకలకు రతన్‌ టాటా కూడా ఓ సారి హాజరయ్యారు.శంతను వయసులో చిన్నవాడే అయినా ఆలోచనా ధోరణిలో మాత్రం పెద్దవాడే అని రతన్‌ టాటా భావించేవారు. కరోనా కాలంలో ఎన్నో సహాయక కార్యక్రమాలు చేశారు రతన్‌ టాటా. ఆ పనులన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నారు శంతను. ప్రస్తుతం వృద్ధుల కోసం ‘గుడ్‌ఫెలోస్‌’ అనే స్టార్టప్‌ను నడుపుతున్నాడు శంతను నాయుడు. ఇది శంతను నాయుడు స్టోరీ. మరి టాటా నీడ లాంటి వాడైన శంతను నాయుడుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.