Arpita Mukherjee న‌టి, మోడ‌ల్, ఈడీ అరెస్ట్ చేసిన‌ TMC మంత్రికి సన్నిహితురాలు, ఎవ‌రీ అర్పితా ముఖర్జీ?

ఆ త‌ర్వాత 2010లో సినిమాల్లోంచి త‌ప్పుకుంది. ఆమె పార్టీ వేదిక‌ల మీద చాలాసార్లు క‌నిపించింది. ఆమెకు పార్టీకి అస్స‌లు సంబంధం లేదని టీఎంసీ చెబుతోంది

ఆ త‌ర్వాత 2010లో సినిమాల్లోంచి త‌ప్పుకుంది. ఆమె పార్టీ వేదిక‌ల మీద చాలాసార్లు క‌నిపించింది. ఆమెకు పార్టీకి అస్స‌లు సంబంధం లేదని టీఎంసీ చెబుతోంది

SC కుంభకోణంలో అరెస్టయిన బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి సన్నిహిత సహాయకురాలు. 2004లో మోడల్‌గా కెరీర్ మొద‌లుపెట్టింది. ఆ త‌ర్వాత సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆ త‌ర్వాత 2010లో సినిమాల్లోంచి త‌ప్పుకుంది. ఆమె పార్టీ వేదిక‌ల మీద చాలాసార్లు క‌నిపించింది. ఆమెకు పార్టీకి అస్స‌లు సంబంధం లేదని టీఎంసీ చెబుతోంది

అర్పితా ముఖర్జీ(Arpita Mukherjee) గురించి బెంగాల్ రాజకీయ వ‌ర్గాల్లో చాలా గుస‌గుస‌లు వినిపిస్తుంటాయి. ఈ మోడల్ క‌మ్ నటి నుంచి నుండి ప‌లుక‌బ‌డున్న‌ పశ్చిమ బెంగాల్ మంత్రికి సన్నిహితురాలేయ్యేవ‌ర‌కు అర్పితా ముఖర్జీ రాజ‌కీయ ఆకాశంలో ఉల్క‌లా ఎదిగారు. ఇప్పుడు ఆక‌స్మాత్తుగా వెలుగును పోగొట్టుకున్నారు. నిజానికి ఆమె ప‌త‌నం కూడా గొప్ప‌గా ఉంది. ఉత్తర 24 పరగణాస్‌లోని బెల్గారియా మిడిల్ క్లాస్ అడ్స్ నుంచి దక్షిణ కోల్‌కతాలోని డ‌బ్బున్న‌ టాలీవుడ్ ప్రాంతానికి మారింది.

2004లో మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన తర్వాత అర్పిత, కోల్‌కతా వెలుగు జిలుగుల ప్ర‌పంచంలోని అడుగుపెట్టింది. ఎద‌గ‌డానికి చాలా తొంద‌ర‌గా మెట్లు వేసుకుంది. కొన్నాళ్లు నిర్మాతల చుట్టూ తిరిగిన త‌ర్వాత, సినిమాలు వచ్చాయి. ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, రంజిత్ ముల్లిక్ , అనన్య ఛటర్జీ నటించిన 2010 బెంగాలీ చిత్రం ‘మామా భగ్నే’లో అర్పిత కాస్త ప్రాధాన్య‌తున్న‌పాత్రే. ‘బంగ్లా బచావో’లో పావోలీ డ్యామ్, షాహెబ్ భట్టాచార్య, ప్రోసెంజిత్ ఛటర్జీల సరసన నటించింది. అక్క‌డితో ఆమె అందరికీ తెలిసింది.

మీరు అర్పిత సోష‌ల్ మీడియాను చూస్తే, అందులో న‌టిగా, మోడ‌ల్ గా చెప్పుకుంది. ఇక బెంగాల్ మంత్రి ఛ‌ట‌ర్జీ ఆధ్వ‌ర్యంలో న‌డిచే నక్తలా ఉదయన్ సంఘ దుర్గా పూజ ఉత్సవాలతో ఆమె పాల్గొంది. ఛటర్జీతో ఎక్క‌డ‌కు వెళ్తే అక్క‌డ‌ కలిసి కనిపించింది. బెంగాల్ మంత్రులు, ప్ర‌ముఖ‌ల‌తో దిగిన ఫోటోల‌ను ఫేస్ బుక్ లో షేర్ చేసింది.

ఛ‌ట‌ర్జీతో స‌న్నిహిత సంబంధాలేకాదు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ‌, అర్పిత మంత్రిగారి నియోజకవర్గమైన బెహలా పశ్చిమ్‌లో గ‌ట్టిగానే తిరిగింది.

ప‌శ్చిమ‌ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమీషన్ (WBSSC) రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో కోట్లలో ముడుపులు ముట్టాయ‌న్న‌ది ఏజెన్సీ అనుమానం. అందుకే ఆమె ఫ్లాట్ నుండి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం ₹21 కోట్లను స్వాధీనం చేసుకుంది. అప్పుడే జాతీయ‌స్థాయిలో గ‌గ్గోలు పుట్టింది. ఆ మ‌రుస‌టి రోజు అర్పితను అరెస్టు చేశారు. ఈ స్కామ్, బెంగాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పార్థ ఛటర్జీ విద్యా శాఖ ఇన్‌చార్జిగా ఉన్న‌కాలంలో జ‌రిగిన‌వే. అందులోనూ ఆమె ఆ మంత్రికి స‌న్నిహితురాలు.

డైమండ్ సిటీలోని ఆమె ఫ్లాట్ నుంచి రూ.66 లక్షల విలువైన నగలు, 20 మొబైల్ ఫోన్లు, విదేశీ కరెన్సీకూడా ఈడీకి దొరికింది. అర్పితకు కోల్‌కతాలోనేకాదు, బెంగాల్‌లో అనేక ప్లాట్లు, ఆస్తులు ఉన్నాయని, అంతేకాదు, కొన్ని కంపెనీలకు ఆమె డైరెక్టర్ ఈడీ అంటోంది. త‌మ రైడ్ గురించి మీడియాకు ప్ర‌క‌ట‌న ఇచ్చిన ED అర్పితను మంత్రి ఛటర్జీకి స‌న్నిహితురాలిగా పేర్కొంది.

Show comments