iDreamPost
android-app
ios-app

Viraata Parvam : రానా సినిమా రిలీజ్ ఎప్పుడు తేలుతుంది

  • Published Jan 31, 2022 | 7:48 AM Updated Updated Jan 31, 2022 | 7:48 AM
  • Published Jan 31, 2022 | 7:48 AMUpdated Jan 31, 2022 | 7:48 AM
Viraata Parvam : రానా సినిమా రిలీజ్ ఎప్పుడు తేలుతుంది

బహుశా సురేష్ సంస్థ నుంచి ఒక పూర్తయిన సినిమాకు విడుదలలో ఇంత జాప్యం జరగడం ఇదే మొదటిసారేమో. రానా సాయిపల్లవి ఫస్ట్ టైం కాంబినేషన్ లో రూపొందిన విరాటపర్వంకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా యూనిట్ నిర్లిప్తంగా ఉండటం అభిమానులకు అంతు చిక్కడం లేదు. పోనీ నారప్ప, దృశ్యం 2లాగా ఓటిటికి ఇస్తే అదేదో నేరుగా ప్రకటించేస్తే సరిపోతుంది. అదీ చేయడం లేదు. రెండు మూడు రోజులు చిన్న ప్యాచ్ వర్క్ తప్ప మొత్తం అయిపోయిందన్నారు కానీ హీరోతో సహా అందరూ ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారు. నిర్మాత సురేష్ బాబు సైతం మౌనాన్నే ఆశ్రయించారు తప్ప క్లారిటీ ఇవ్వడం లేదు.

శ్రీవిష్ణుతో తీసిన నీది నాది ఒకే కథతో పరిచయమైన దర్శకుడు వేణు ఊడుగులకు ఇది రెండో సినిమా. 90 దశకంలోని నక్సల్స్ నేపధ్యాన్ని తీసుకుని హై ఇంటెన్స్ డ్రామాగా దీన్ని రూపొందించారు. ప్రియమణి, నందితాదాస్ లాంటి మంచి క్యాస్టింగ్ ఇందులో ఉంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన పాటలు ఆల్రెడీ యుట్యూబ్ లో బాగానే రీచ్ అయ్యాయి. ఇంత జరిగిన తర్వాత సైలెంట్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. పోనీ కాంబినేషన్ కి క్రేజ్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. పైగా ఫామ్ లో ఉన్న సాయిపల్లవి, రానా బ్రాండ్ సోషల్ మీడియాలో హైప్ తీసుకొచ్చాయి. టీజర్ వచ్చి కూడా చాలా కాలమయ్యింది.

జనవరిలో ఏదో ఒక డేట్ కి వచ్చినా విరాట పర్వంకు వర్కౌట్ అయ్యేదే. అదీ జరగలేదు. ఫిబ్రవరి ఇప్పటికే ఫుల్ బ్లాక్ అయిపోయింది. మార్చి, ఏప్రిల్ రెండు నెలలు పాన్ ఇండియా సినిమాల హంగామా ఉంది. జూన్ అంటే మరీ లేట్. ఉన్న కాసింత బజ్ చల్లారిపోతుంది. సో ఈ లెక్కన గతంలో ప్రచారం జరిగినట్టు ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ కో లేదా ఇంకో ఓటిటికో ఇస్తారేమో మరి. 15 నుంచి 20 కోట్ల మధ్యలో డీల్ వచ్చిందని ఆ నిర్ణయం దగ్గరే ఆలస్యమవుతోందని అంటున్నారు. థియేటర్లు తెరుచుకున్నా సరే కొత్త సినిమాలు ఓటిటిలో రావడం ఇప్పుడేమంత పెద్ద విషయం కాదు. అన్ని భాషల్లో జరుగుతున్నదే. మరి విరాటపర్వం ఓటు ఎటు వైపు వెళ్తుందో చూడాలి

Also Read : Pushpa Hindi : బాలీవుడ్ లో తగ్గేదేలే అంటున్న ఐకాన్ స్టార్

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş