iDreamPost
iDreamPost
యూజర్లలకు మూడు కొత్త ప్రైవసీ ఫీచర్లను వాట్సాప్ పరిచయం చేస్తోంది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటనకూడా చేశారు. ఈ ఫీచర్స్ తో చాట్స్ మరింత భద్రంగా తయారుకానున్నాయి. “WhatsAppకి వస్తున్న కొత్త ప్రైవసీ ఫీచర్లు ఏంటంటే? గ్రూప్ చాట్‌ల నుండి ఎవరికీ నోటిఫికేషన్ వెళ్లకుండా సైలెంట్ గా బైటకు వచ్చేయొచ్చు. మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరు చూడవచ్చో? ఎవరు చూడకూడదో మీరే కంట్రోల్ చేయొచ్చు. మీరు పంపించే మెజేజ్ లను స్క్రీన్‌షాట్‌లు తీయకుండా అడ్డుకోవచ్చు.
వాట్సప్ గ్రూపులను సైలెంట్ గా వదిలేయండి
మీ వాట్సప్ గ్రూపు అసవరంలేదనుకున్నారు. బైటకు వచ్చేయాలి. ఇప్పటిదాకా మీరు బైటకు వస్తే ఆవిషయం అందరికీ తెలిసిపోతుంది. మీరు ఎగ్జిట్ అయ్యారని వాట్సప్ అందరికీ చెబుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన అవసరంలేకుండానే, గ్రూపు నుంచి ప్రైవేట్‌గా బైటకు వచ్చేయొచ్చు. మీరు కావాలనుకొంటే మీ నెంబర్ ని చూడకుండా హైడ్ చేయొచ్చు. కొత్త ఫీచర్ ప్రకారం, ఎగ్జిట్ అయితే గ్రూప్‌కు బదులుగా, ఎడ్మిన్ లకు మాత్రమే తెలుస్తుంది. ఈ నెలలో యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
మీ ఆన్‌లైన్ స్టేటస్ ను ఎవరు చూడాలో మీరే డిసైడ్ చేయొచ్చు
మీరు ఆన్ లైన్ లో ఉన్నారంటే ఎవరైనా తెలుసుకోవచ్చు. నిజానికి ఇది మీ ప్రైవసీకి సంబంధించిన అంశం. అందుకే వాట్సప్ కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీస్తోంది. దీని ప్రకారం, మీ ఆన్ లైన్ స్టేటస్ ఎవరికి కనిపించాలో, ఎవరికి వద్దో మీరే డిసైడ్ చేయొచ్చు. అంటే కేవలం మీ ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే తెలియాలంటే, వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది. మిగిలినవాళ్లకు ఆన్ లైన్ అని కనిపిచదు. ఈ ఫీచర్ రెడీ. ఈ నెలలోనే మీకు అందుబాటులోకి రానుంది.
మీ మెసేజ్ ల స్క్రీన్‌షాట్ బ్లాక్ చేయొచ్చు
WhatsApp లో మీరు చాట్ చేశారు. కాని ఎవరైనా స్క్రీన్ షాట్ తీస్తే? మీ ప్రైవసీకి ఇబ్బంది. అందకే వాట్సాప్ వ్యూ వన్స్ మెసేజ్‌ల కోసం స్క్రీన్‌షాట్ బ్లాకింగ్‌ని ఎనేబుల్ చేస్తోంది. అంటే, మీ చాట్స్, ఫోటోలను ఎవరూ స్క్రీన్ షాట్ తీయలేరు. ఈ ఫీచర్ ని వాట్సప్ టెస్ట్ చేస్తోంది. త్వరలో అందుబాటులోకి రానుంది.