iDreamPost
iDreamPost
చూస్తుంటే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తన గురువు సుకుమార్ అడుగు జాడల్లోనే నడిచేలా ఉన్నాడు. మొదటి సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సాధించి ఏడాది అవుతున్నా ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టనే లేదు. జూనియర్ ఎన్టీఆర్ తో నెక్స్ట్ ఉంటుందనే వార్తలు గట్టిగా వినిపించాయి కానీ దానికి సంబంధించి ఎలాంటి కదలిక కనిపించడం లేదు. మరోవైపు తారక్ ఆర్ఆర్ఆర్ అయిపోయాక కొరటాల శివకు కమిట్ అయ్యాడు. అదింకా రెగ్యులర్ షూట్ కు వెళ్ళలేదు. ఆచార్య విడుదలయ్యాకే స్టార్ట్ అయ్యేలా ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నాడు. ఒకవేళ అది లేట్ అయితే తప్ప బుచ్చిబాబుకు ఛాన్స్ దక్కదు.
ఇదంతా జరిగే లోగా ఏడాదిపైగానే ఈజీగా గడిచిపోతుంది. అంతకన్నా ఎక్కువైనా ఆశ్చర్యం లేదు. మరి బుచ్చిబాబు అప్పటిదాకా వెయిట్ చేస్తాడా అంటే ఏమో చెప్పలేం. వైష్ణవ్ తేజ్ తోనే మరో సినిమా చేస్తాడనే ప్రచారం జరిగింది. కానీ అతనేమో రంగ రంగ వైభవంగాతో బిజీ అయ్యాడు. కొండపొలం దెబ్బకు ఎక్స్ పెరిమెంట్ల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్న వైష్ణవ్ కంటే స్టార్ హీరోలతో చేయడానికే బుచ్చిబాబు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అల్లు అర్జున్ కు కూడా ఒక లైన్ వినిపించి మెప్పించాడట. అయితే ఈలోగా ఆట్లీ లైన్ లోకి రావడంతో బుచ్చిబాబుని పెండింగ్ లో పెట్టినట్టు వినికిడి.
ఏదైతేనేం రంగస్థలం తర్వాత రెండున్నరఏళ్ళ గ్యాప్ వచ్చిన సుకుమార్ తరహాలో బుచ్చిబాబు కూడా గ్యాప్ తీసుకునేలా కనిపిస్తోంది. మంచి హిట్లు సాధించిన నవతరం దర్శకులు కాంబినేషన్ల కోసం ఇలా ఏళ్ళ తరబడి విలువైన సమయం వృధా చేయడం సినిమాలు తక్కువ వచ్చేలా చేస్తోంది. సందీప్ వంగా అర్జున్ రెడ్డి తర్వాత ఇప్పటిదాకా ఇంకో తెలుగు స్ట్రెయిట్ మూవీ చేయలేదు. ప్రభాస్ స్పిరిట్ కి మొన్నెప్పుడో గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఇంతేసి టైంలో ఒకటో రెండో ఈజీగా సినిమాలు చేసిండొచ్చు. పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ కూడా ఇదే శైలి. వేగంగా చిత్రాలు తీయాలనే ధోరణి తొందరపాటు అనుకున్నా మరీ ఇంత నెమ్మది కూడా మంచిది కాదుగా
Also Read : Balakrishna : NBK 109 కోసం డిఫరెంట్ కాంబినేషన్