iDreamPost
android-app
ios-app

రికార్డుల సచ్ఛీకరణ అంటే ఏమిటి..? ఏ భూ సమస్యలను పరిష్కరిస్తారు..? రీ సర్వేతో సంబంధం ఏమిటి..?

రికార్డుల సచ్ఛీకరణ అంటే ఏమిటి..? ఏ భూ సమస్యలను పరిష్కరిస్తారు..?  రీ సర్వేతో సంబంధం ఏమిటి..?

రీ సర్వే సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌)కు అండగళ్‌కు మధ్య ఏపీలో భూ విస్తీర్ణం లెక్కలో దాదాపు ముప్పైమూడున్నర లక్షల ఎకరాలకు పైగా తేడా ఉంది. అంటే ఇప్పటి వరకు రెవిన్యూ రికార్డులకు ప్రామాణికంగా తీసుకుంటున్న ఆర్‌ఎస్‌ఆర్‌ కంటే ఇన్ని లక్షల ఎకరాల భూమి రికార్డుల్లోకి అదనంగా ఎక్కేసిందన్నమాట. అమ్మకందారులు, కొనుగోలుదారుల పేరిట రీ ఎంట్రీలు నమోదు చేయడం దగ్గర్నుంచి, తల్లిదండ్రుల పేరిట రికార్డులు అలాగే ఉండి పిల్లల పేరిట కొత్తగా భూ రికార్డులు పుట్టుకురావడం వరకు దీనికి పలు కారణాలను రెవిన్యూ అధికారులు గుర్తించారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం పేరుతో భూములను రీ సర్వే చేసి యజమానులకు శాశ్వత హక్కులను కల్పించాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 21వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది.

రీ సర్వే చేసే ముందు భూ రికార్డుల సచ్ఛీకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. రెవెన్యూ విలేజ్‌ పరిధిలోని రికార్డులను పూర్తిగా పరిశీలించి.. మార్పులు, చేర్పులు, తప్పులు సరిదిద్దడం ఈ సఛ్ఛీకరణ ముఖ్య లక్ష్యం. ఈ పని పూర్తి అయితేనే రీ సర్వే చేయడం సాధ్యం అవుతుంది. అందుకే ఈ నెల 31వ తేదీ లోపు భూ రికార్డుల సచ్ఛీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను పరుగులు పెడుతోంది. ప్రతి శనివారం సంబంధిత మండల తహసీల్దార్‌ తన పరిధిలోని రెవిన్యూ గ్రామానికి వెళ్ళి అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేసి రికార్డుల ప్రక్షాళనకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించాలని సీయం జగన్‌ ప్రభుత్వం నిర్దేశించింది. మొదటి దశ సర్వే జరిగే గ్రామాలలో రికార్డుల సచ్ఛీకరణ వేగంగా సాగుతుండగా.. రెండు, మూడు దశల్లో రీ సర్వే జరిగే రెవెన్యూ గ్రామాలలో మాత్రం నెమ్మదిగా సాగుతోంది. రికార్డుల సచ్ఛీకరణ అనేది ఒకటి జరుగుతుందనే విషయం కూడా ఆయా గ్రామాల్లోని రైతులకు తెలియదంటే.. రెవెన్యూ సిబ్బంది ఏ స్థాయిలో పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

రికార్డుల సచ్ఛీకరణ పూర్తయితే.. రీ సర్వేతో సంబంధం లేకుండానే చాలా భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. అందుకే ప్రభుత్వం రికార్డుల సచ్ఛీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ రికార్డుల సచ్ఛీరణలో ఏ ఏ భూ సమస్యలు పరిష్కారం చేస్తామనేది మొదటి దశలో రీ సర్వే జరిగే రెవెన్యూ గ్రామాలలోని రెవెన్యూ అధికారులు రైతులకు వివరిస్తున్నారు.

రికార్డుల స్వచ్ఛీకరణలో ఈ కింది సమస్యలను రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తున్నారు…

1) భూమితో సంబంధం లేని వ్యక్తి పేరు / విస్తీర్ణం నమోదై ఉండడం.

2) అమ్మకందారు/ కొనుగోలు దారులు ఇద్దరి పేర్లు నమోదై ఉండడం.

3) ఆర్‌ఎస్‌ఆర్‌ డైగ్లాట్‌నందు విస్తీర్ణం, హక్కుదారులు/ అనుభవదారుల పేర్లు సక్రమంగా నమోదు కాకపోవడం.

4) అడంగళ్‌లో అదనంగా వేరే సర్వే నంబరు నమోదైపోవడం.

5) తనది కాని భూమి తన ఖాతాలో నమోదైపోవడం.

6) మాన్యువల్‌ 1బీ/ పట్టాదారు పాసుపుస్తకంలో భూమి నమోదై ఉండి. ప్రస్తుత వెబ్‌లాండ్‌నందు సదరు భూమి వివరాలు నమోదుకాకపోవడం.

7) సర్వే నెంబరు నందు వెబ్‌ల్యాండ్‌లో విస్తీర్ణం తక్కువగా నమోదుకావడం.

8) అడంగళ్‌లో సర్వే నెంబరు నమోదు కాకపోవడం.

9) నోషనల్‌ ఖాతా ఉండి పట్టాదారునిగా, అనుభవదారునిగా ఒకే వ్యక్తి పేరు ఉండడం.

10) నోషనల్‌ ఖాతా ఉండి, భూమి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి పేరు అడంగళ్‌లో నమోదైనప్పుడు.

11) పట్టాదారు పాసు పుస్తకంలో ఖాతానెంబరు ఉండి వెబ్‌ల్యాండ్‌ అడంగళ్‌నందు నోషనల్‌ నెంబరులో సర్వే నెంబరు ఉన్నప్పుడు.

12) పట్టాదారు పాసుపుస్తకంలో పేర్లు నమోదులో తేడాలు.

13) ఒక వ్యక్తికి ఒక గ్రామంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ రెవిన్యూ ఖాతాలు ఉంటే సరి చేసుకోవాలి.

14) వచ్చిన పేరు/విస్తీర్ణం వివరాలే మళ్ళీ నమోదైన పక్షంలో.

15) చనిపోయిన పట్టాదారుల రికార్డులో నమోదైపోయిన పక్షంలో వారిని తొలగించి వారి వారసుల పేరున మ్యుటేషన్‌ చేయడం.

16) రిజిస్ట్రేషన్‌ ద్వారా భూమిని పొందినప్పటికీ అడంగళ్‌లో వారి పేరున మ్యుటేషన్‌ జరక్కపోతే మ్యుటేషన్‌ చేయడం.

17) అసైన్డ్‌ భూమి పొందినప్పటికీ ప్రస్తుతం వెబ్‌లాండ్‌ నందు పేర్లు నమోదు లేకపోవడం.

18) ఆధార్, మొబైల్‌ నంబరు, ఖాతా నంబరు నమోదులో పొరపాట్లు సరిచేయడం.

18) పట్టాదారుని కాలమ్‌లో పేర్లు నమోదు కాకుండా ‘‘శ్రీ’’ లేదా ‘‘రావు’’ వంటి పేర్లను మాత్రమే నమోదు చేసినట్టేయితే వాటిని సరి చేయడం.

19) రికార్డుల్లో పేర్లు తప్పు పడితే వాటిని సరిచేయడం.

20) అనుభవ స్వభావం తప్పుగా నమోదైతే వాటిని సరిచేస్తారు. అంటే ఆర్‌ఎస్‌డీ, కొనుగోలు, స్వంతం, వీలునామా, వారసత్వం, అగ్రిమెంటు తదితర స్వభావాల తప్పులు కూడా మార్పు చేసుకోవచ్చు.

21) భూమి వర్గీకరణ (మాగాణి, మెట్ట) వివరాల్లో తేడాలుంటే సరిచేస్తారు.

Jojobet GirişmeritbetmeritbetcasibomCasibom girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/