iDreamPost
android-app
ios-app

చైతన్య సమంతాలు ముందే జాగ్రత్త పడ్డారా

  • Published Oct 04, 2021 | 5:30 AM Updated Updated Oct 04, 2021 | 5:30 AM
చైతన్య సమంతాలు ముందే జాగ్రత్త పడ్డారా

రెండు రోజులు అవుతున్నా నాగ చైతన్య సమంతాల విడాకుల వ్యవహారం మీడియాలో ఇంకా హాట్ టాపిక్ గా నానుతూనే ఉంది. ముఖ్యంగా టీవీ ఛానల్స్ దీని మీద డిబేట్లు మాత్రం ఆపడం లేదు. ఆఖరికి ఎవరో ట్విట్టర్ లోనో ఇన్స్ టాలోనో పోస్టులు పెడితే వాటి మీద కూడా గంటల తరబడి విశ్లేషణలు చేసేస్తున్నారు. రకరకాల కోణాల్లో చైసామ్ కు తెలియని విషయాలను సైతం చెప్పేస్తున్నారు. అందులో ముఖ్యంగా నాగ్ ఫ్యామిలీ సమంతాకు భరణంగా 200 కోట్లను ఆఫర్ చేస్తే తను తిరస్కరించిందనే వార్త బాగా వైరల్ అయ్యింది. ప్రముఖ మీడియా సంస్థల వెబ్ సైట్స్ లోనూ ఇది ప్రత్యక్షమయ్యింది. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నట్టు మరో న్యూస్.

పెళ్లికి ముందే చైతు సామ్ ల మధ్య ఒక లీగల్ అగ్రిమెంట్ జరిగిందట. ఒకవేళ భవిష్యత్తులో ఏ కారణం వల్ల అయినా విడిపోవలసి వస్తే ఎవరూ అవతలి వారిని ఎలాంటి పరిహారాన్ని నగదు రూపంలో కానీ ఆస్తుల రూపంలో కానీ అడగకూడదని రాసుకున్నారట. నిర్మాత కం చైతు మావయ్య సురేష్ బాబు ఆధ్వర్యంలో మరో ప్రొడ్యూసర్ కం లాయర్ నిరంజన్ రెడ్డి వీటికి సంబంధించిన వ్యవహారాలు చూసుకున్నారని ఇన్ సైడ్ టాక్. ఎప్పుడు ప్రకటించాలి ఎలా చెప్పాలి అనేది కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు కాబట్టే ఒకే మ్యాటర్ ని కేవలం పేర్లు మార్చి ట్వీట్ చేశారనే కామెంట్ కూడా వినిపిస్తోంది. సో 200 కోట్ల డీల్ ఉత్తుత్తిదేనన్న మాట.

దీనికి అధికారిక ధృవీకరణ లేదు కానీ టాక్ అయితే గట్టిగానే ఉంది. ఇదంతా అక్కినేని సమంతా కుటుంబాల అంతర్గత విషయం కాబట్టి వివరాలను అధికారికంగా ఇవ్వలేరు. అందులోనూ చైతు సామ్ లు వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ కెరీర్ లో బిజీగా ఉన్నారు. విడిపోయాక కూడా ఎవరి బిజీలో వాళ్ళుంటారు తప్ప అదే పనిగా మీడియా చెబుతున్న రేంజ్ లో బాధ పడటం, ఎడబాటు ఫీల్ కావడం లాంటివేవీ ఉండవు. ఇంకో నాలుగైదు రోజులు అంతే. అందరూ మర్చిపోతారు. లవ్ స్టోరీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న చైతు థాంక్ యు షూటింగ్ అయ్యాక కొంత బ్రేక్ తీసుకుని బంగార్రాజు కంటిన్యూ చేస్తారు. సామ్ కొత్త ప్రాజెక్టులు ఇంకా కన్ఫర్మ్ కాలేదు

Also Read : యుట్యూబ్ బామ్మకు మెగా ఆఫర్ వచ్చిందా

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişjojobet girişcasibom