iDreamPost
iDreamPost
ముఖ్యమంత్రి వై.యస్ జగన్ తీసుకున్న మూడు రాజధానులు, అభివృద్ది వికేద్రీకరణ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నాం అని సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి స్పష్టం చేశారు. విశాఖపట్నం కేంద్రంగా కార్య నిర్వాహక రాజధాని, అమరావతి కేంద్రంగా చట్ట సభలు , గవర్నర్ బంగ్లా , కర్నూల్ కేంద్రంగా హై కోర్టు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆహ్వానించదగినదిగా చెప్పుకోచ్చారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం ఆంద్ర యునివర్సిటి వెల్లాల్సింది రాయలసీమ ప్రాంతానికి కాని దానిని విశాఖలో ఏర్పాటు చేశారని , కర్నూల్ రాజధానిగా ఎర్పడినా కొద్దిరోజులకే హైద్రబాద్ కి వెళ్ళిపోయిందని ఎన్నో ఏళ్ళుగా ఆప్రాంతం వారు అభివృద్దికి దూరంగా ఉండిపోయారని, ఈ సమయంలో ముఖ్యమంత్రి వై.యస్ జగన్ కర్నూలు పై దృష్టి పెట్టటం, వారికి న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవటం ఆహ్వానించదగ్గ విషయం అని చెప్పారు.
అలాగే ఉత్తరాంద్ర విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా ప్రజలు ఎంతో మంది పొట్ట చేతపట్టుకుని బొంబాయి, హైద్రబాద్ లకు వలసలు వెలుతున్నారని నేడు విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పడటం వలన వలసలు తగ్గి ఈ ప్రాంతం అభివృద్ది పధంలోకి వెళ్ళి ప్రజలకి మేలు జరుగుతుందని అలాగే అమరావతి కూడా అక్కడ ఏర్పాటు చేసే చట్టసభల వలన అమొఘమైన అభివృద్ది జరిగి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ప్రాంతాలు ఏకకాలంలో అభివృద్ది జరిగే అవకాశం ఏర్పడుతుందని అందుకే ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అని చెప్పుకోచ్చారు.