iDreamPost
iDreamPost
2006లో వారణాసిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో.. సూత్రధారి, దోషి అయిన వలీ ఉల్లా ఖాన్ కు ఘజియాబాద్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ మేరకు నిన్న తీర్పు వెలువరించింది. వారణాసి బాంబు పేలుళ్ల కేసులో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లకు సంబంధించి.. పోలీసులు మూడు కేసులు నమోదు చేయగా.. ఒక కేసులో వలీ ఉల్లా ఖాన్ కు కోర్టు మరణశిక్ష, హత్యాయత్నం కేసులో జీవిత ఖైదు, జరిమానా విధించింది.
వలీ ఉల్లా ఖాన్ పై నమోదుచేయబడిన మూడో కేసుకు సంబంధించి బలమైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో.. ఆ కేసులో అతడిని నిర్దోషిగా ప్రకటించింది. అతడి తరపున వాదించేందుకు వారణాసికి చెందిన న్యాయవాదులు ఎవరూ ముందుకు రాకపోవడంతో అలహాబాద్ హైకోర్టు ఈ కేసును ఘజియాబాద్ కోర్టుకు బదిలీ చేసింది.