SNP
Virender Sehwag, Ravichandran Ashwin: ఐపీఎల్ 2024లో ఓ టీమిండియా స్టార్ ప్లేయర్ చెత్త ప్రదర్శనపై దిగ్గజ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Virender Sehwag, Ravichandran Ashwin: ఐపీఎల్ 2024లో ఓ టీమిండియా స్టార్ ప్లేయర్ చెత్త ప్రదర్శనపై దిగ్గజ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో పెద్ద రాణించని ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ గురించి భారత దిగ్గజ మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తానే కనుక ఆ జట్టుకు కోచ్‌గానో, మెంటర్‌గానో ఉండి ఉంటే.. అతన్ని అస్సలు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోను అంటూ కామెంట్ చేశాడు. ఇంతకీ సెహ్వాగ్ ఎవరి గురించి చెప్పాడని ఆలోచిస్తున్నారా? అతను టీమిండియాలో సూపర్ సీనియర్ బౌలర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న అశ్విన్.. పరుగులు తక్కువ ఇస్తున్నా.. వికెట్లు తీయడంలో మాత్రం విఫలం అవుతున్నాడు. ఈ క్రమంలోనే సెహ్వాగ్ మాట్లాడుతూ.. అశ్విన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
అశ్విన్ ఇలాగే వికెట్లు తీయకపోతే.. వచ్చే ఐపీఎల్ వేలంలో అతన్ని ఈ టీమ్ కూడా కొనుగోలు చేయదని, అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోతాడంటూ విమర్శించాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. కేవలం రెండంటే రెండు వికెట్లు మాత్రమే తీశాడు. 31 ఓవర్లు వేసి 279 పరుగులు సమర్పించుకున్నాడు. ఎకానమీ కూడా 9గా ఉంది. అయితే.. ఒక సీనియర్ స్పిన్నర్‌గా ఉన్న అశ్విన్ స్థాయి ప్రదర్శన ఇది అయితే కాదనే భావన అందరిలో ఉంది. ఈ క్రమంలోనే సెహ్వాగ్ కాస్త ఘటూగానే అశ్విన్ ప్రదర్శనపై కామెంట్ చేశాడు. ప్రస్తుతం సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంత డైరెక్ట్‌గా సెహ్వాగ్ మాట్లాడటం కూడా కొంతమంది క్రికెట్ అభిమానులకు నచ్చడం లేదు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎలాంటి భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వికెట్లు ఫ్లాట్‌గా ఉండటం, బౌండరీ లైన్స్ దగ్గరగా ఉండటం, ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల బ్యాటర్లు ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతుండటంతో బౌలర్లు బలవుతున్నారు. పైగా స్పిన్నర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రషీద్ ఖాన్ లాంటి స్పిన్నర్ కూడా ఈ ఐపీఎల్ సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇన్ని ప్రతి కూలత మధ్య కూడా అశ్విన్ 9 ఎకానమీతో పర్వాలేదనిపిస్తున్నా.. వికెట్లు తీయడంలో మాత్రం కాస్త వెనుకబడ్డాడు. అయినా ఈ ఒక్క సీజన్‌తో అశ్విన్ స్థాయి తగ్గిపోదని, అయినా ఐపీఎల్ వేలం అశ్విన్ సామర్థ్యానికి క్రైటీరియా కాదని, టీమిండియా అత్యుత్తమ బౌలర్లలో అశ్విన్ ఒకడని క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరి అశ్విన్ గురించి సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virender Sehwag ” If I were the coach or mentor of the franchise,I would never pick Ravi Ashwin in the Playing eleven.Ashwin might go unsold in the next auction if he doesn’t take wickets in IPL 2024.”pic.twitter.com/TNVd49r9xM
— Sujeet Suman (@sujeetsuman1991) April 28, 2024