iDreamPost
android-app
ios-app

రోహిత్‌ శర్మ ఆసియా కప్‌ గెలిచినా.. కెప్టెన్‌గా కోహ్లీనే కింగ్‌! ఎలాగంటే?

  • Published Sep 19, 2023 | 4:30 PM Updated Updated Sep 19, 2023 | 4:30 PM
  • Published Sep 19, 2023 | 4:30 PMUpdated Sep 19, 2023 | 4:30 PM
రోహిత్‌ శర్మ ఆసియా కప్‌ గెలిచినా.. కెప్టెన్‌గా కోహ్లీనే కింగ్‌! ఎలాగంటే?

రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 8వ ఆసియా కప్‌ను గెలిచింది. కొలంబో వేదికగా శ్రీలంకతో గత ఆదివారం జరిగిన ఫైనల్లో మొహమ్మద్‌ సిరాజ్‌ అద్భుత బౌలింగ్‌తో టీమిండియా అఖండ విజయం సాధించి.. సగర్వంగా ఆసియా కప్‌ను ముద్దాడింది. ఈ కప్పుతో భారత్‌లో మొత్తం 8 టైటిల్స్‌ వచ్చి చేరాయి. అయితే.. 2018లో గెలిచిన ఆసియా కప్‌ సైతం రోహిత్‌ కెప్టెన్సీలోనే. కానీ, అతనప్పుడు రెగ్యులర్‌ కెప్టెన్‌ కాదు. కానీ, ఈ సారి అతనే టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌. అయితే.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఆసియా కప్‌ గెలిచినా.. ఒక రికార్డు విషయంలో కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ కంటే మెరుగ్గా ఉన్నాడు.

ఆసియా కప్‌ 2023 ఫైనల్‌తో రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా 33 వన్డేలు పూర్తి చేసుకున్నాడు. ఈ 33 వన్డేల్లో టీమిండియా 24 విజయాలు సాధించింది. 8 మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. రెగ్యులర్‌ కెప్టెన్‌ అయిన తర్వాత రోహిత్‌ కెప్టెన్సీలో టీమిండియా 23 వన్డేలు ఆడింది. కానీ, ఓవరాల్‌గా ఇప్పటి వరకు రోహిత్‌ కెప్టెన్సీలో టీమిండియా 33 వన్డేలు ఆడి 24 విజయాలు సాధించింది. కానీ, విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా 33 వన్డేలు పూర్తి చేసుకునే సమయానికి 25 విజయాలతో రోహత్‌ కంటే ఒక విజయం ఎక్కువ సాధించాడు. ఇలా రోహిత్‌ కంటే మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు.

ఆసియా కప్‌ను విజయవంతంగా ముగించిన రోహిత్‌ శర్మ.. తన ఫోకస్‌ మొత్తం వన్డే వరల్డ్‌ కప్‌పైనే పెట్టాడు. 1983లో తొలి వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమిండియా.. మళ్లీ 28 ఏళ్ల తర్వాత 2011లో ధోని కెప్టెన్సీలో కప్పు కొట్టింది. ఆ తర్వాత మళ్లీ వన్డే వరల్డ్‌ కప్‌ నెగ్గలేదు. కానీ, ఈ సారి ఎలాగైన వరల్డ్‌ కప్‌ గెలవాలనే కసి టీమిండియాలో ఉంది. పైగా ఈ సారి వరల్డ్‌ కప్‌ సైతం మన దేశంలోనే జరగనుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. కెప్టెన్లుగా రోహిత్‌ శర్మ, కోహ్లీ రికార్డులు ఎలా ఉన్నా.. ఆటగాళ్లుగా టీమిండియాకు వరల్డ్‌ కప్‌ అందించాలనే పట్టుదలతో ఉన్నారు. మరి రోహిత్‌, కోహ్లీ కెప్టెన్సీ రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసీస్‌తో సిరీస్‌లో కోహ్లీ, రోహిత్‌లకు రెస్ట్‌ ఇవ్వడం వెనుక ప్లాన్‌ ఇదేనా?