iDreamPost
iDreamPost
ఎన్నాళ్ళో వేచిన ఉదయం పాట ఇప్పుడు కమల్ హాసన్ కు సరిగ్గా సరిపోతుంది. ఏళ్ళ తరబడి దూరంగా ఉన్న సక్సెస్ విక్రమ్ రూపంలో భారీ స్థాయిలో వరించడంతో కలుగుతున్న ఆనందం అంతా ఇంతా కాదు. అలా అని ఊరికే ఉండటం లేదు. తన టీమ్ ని కానుకలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇవాళ తన సినిమా క్లైమాక్స్ లో కేవలం మూడు నిమిషాల పాత్ర చేసి గూస్ బంప్స్ తెప్పించిన సూర్యకు రోలెక్స్ వాచ్ ని బహూకరించి ఇద్దరు అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు. అన్నయ్యా అని తను ప్రేమగా పిలిచే అభిమాన హీరో స్వయంగా వచ్చి చేతికి గడియారం కట్టడం కంటే గొప్ప క్షణం సూర్యకు ఇంతకన్నా ఏముంటుంది. ఆ పిక్స్ వైరల్ అయ్యాయి.
ఇంతే కాదు విక్రమ్ కోసం పని చేసిన డైరెక్షన్ టీమ్ లోని 160 సభ్యులకు ఎలెక్ట్రిక్ బైకులు కానుకగా అందాయి. ఇంకొందరికి కూడా అందజేస్తారట. నిన్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి కోటి రూపాయల ఖరీదైన కారుని ఇవ్వడం ఇప్పటికే టాక్ అఫ్ ది కోలీవుడ్ గా మారింది. నిజానికి కమల్ ఇంతగా ఎగ్జైట్ అవ్వడంలో అర్థం ఉంది. ఆయన పనైపోయిందని, విజయ్ అజిత్ లాంటి వాళ్ళతో పోటీ పడి కలెక్షన్లు తేలేరని గత కొంత కాలంగా కథనాలు వస్తూనే ఉన్నాయి. వాటి చెక్ పెడుతూ విక్రమ్ ఇంకా వారం కాకుండానే వంద కోట్ల మార్క్ ని దాటేయడం అంటే చిన్న విషయం కాదు. తెలుగులోనూ ఆరు కోట్ల బ్రేక్ ఈవెన్ ని కేవలం నాలుగు రోజుల్లో అందుకుంది.
అందుకే కమల్ ఉండబట్టలేక ఇలా గిఫ్ట్స్ ఇవ్వడం ద్వారా హ్యాపీ నెస్ ని షేర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వరసలో ఉన్న వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్. విక్రమ్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత వెన్నెముకగా నిలించిందో చూశాం. చాలా స్పెషల్ దే అతనికి ప్లాన్ చేసి ఉంటారు. చెన్నై టాక్ ప్రకారం విక్రమ్ తమిళ వెర్షన్ ఈజీగా 200 కోట్ల గ్రాస్ ని చేరుకుంటుంది. ఆల్రెడీ బీస్ట్, వలిమైని క్రాస్ చేసే పనిలో ఉండగా ఆల్ టైం టాప్ 5లో ఉండొచ్చనే అంచనాలు బలంగా ఉన్నాయి. మొత్తానికి కమల్ హాసన్ గతంలో ఏ సినిమాకూ ఈ స్థాయిలో తన యూనిట్ కి కానుకలు ఇవ్వలేదట. దీన్ని బట్టి ఆయన ఎంతగా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారో అర్థమవుతోంది