iDreamPost
android-app
ios-app

యువకుడి ప్రేమ వేధింపులు తట్టుకోలేక..

  • Published Aug 20, 2023 | 3:28 PM Updated Updated Aug 20, 2023 | 3:28 PM
  • Published Aug 20, 2023 | 3:28 PMUpdated Aug 20, 2023 | 3:28 PM
యువకుడి ప్రేమ వేధింపులు తట్టుకోలేక..

సమాజంలో ప్రేమ పేరుతో ఆడవాళ్లను వేధించటం బాగా ఎక్కువయింది. పెళ్లికి ముందే కాదు.. పెళ్లి తర్వాత ప్రేమ వేధింపులకు గురవుతున్న ఆడవాళ్లు కూడా ఉన్నారు. అయితే, యువతులపై ఎక్కువగా ఈ ప్రేమ వేధింపులు జరుగుతున్నాయి. ప్రేమ వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకుంటున్న వారు కూడా ఈ సమాజంలో ఉన్నారు. తాజాగా, ఓ యువకుడి ప్రేమ వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

ఈ సంఘటన తెలంగాణలోని వికారాబాద్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వికారాబాద్‌లోని హాజీపూర్‌ గ్రామానికి చెందిన బుర్జుకాడి వెంకటమ్మ, రాములు దంపతుల కూతురు ప్రవల్లిక పదవ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు వన్‌సైడ్‌గా ప్రవల్లికను ప్రేమిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా ప్రేమ పేరుతో ప్రవల్లిక వెంటపడుతున్నాడు. ప్రేమించాలంటూ ఆమెను వేధిస్తున్నాడు. రోజు,రోజుకు అతడి వేధింపులు ఎక్కువయిపోయాయి. తనకు ఎంత ఇబ్బంది ఉ‍న్నా.. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియకూడదని ప్రవల్లిక భావించింది. అందుకే యువకుడి ప్రేమ వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పలేదు.

కానీ, ఎలా తెలిసిందో ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. వారు ప్రవల్లికను మందలించారు. తల్లిదండ్రులు తనను తప్పుబట్టటంతో ప్రవల్లిక మనస్తాపానికి గురైంది. శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రవల్లిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ప్రేమ వేధింపుల కారణంగానే తమ కూతురు ఆ‍త్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş