అవును..ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా నాలుగు మీద ఉందట ఆమె ఫోకస్. అదేమిటో తెలుసుకుందాం.
ఒకనాటి తెరని ఏలిన జయసుధ ఇప్పుడు బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెలుగొందుతున్నారు. అయితే ఆమె వయసురిత్యా నాయనమ్మ పాత్రలకి దగ్గరవుతున్నారు. పైగా నదియా తరహాలో సీరియస్ అత్తపాత్రలకి కూడా ప్రత్యామ్నాయాలు కావాలి. అందుకే ఆ గ్యాప్ ని భర్తీ చెయ్యడానికి ఇప్పుడు విజయశాంతి లైన్లోకి వచ్చారని తెలుస్తోంది.
సరిలేరు నీకెవ్వరుతో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇండస్ట్రీలో వెళ్లూనుకుని ఉన్న సెంటిమెంట్ అంశం కూడా పని చేస్తుంది ఆమె మీద.
ఇదిలా ఉంటే ఆమె ఈ నెలలోనే విడుదలైన మళయాళ చిత్రం “బిగ్ బ్రదర్” లో కూడా నటించారు. మోహన్ లాల్ అందులో ప్రధాన పాత్ర. మొత్తానికి యావత్ దక్షిణాది తెరని ఆక్రమించుకోవాలనే ఆలోచన విజయశాంతిలో బలంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక తమిళ, కన్నడ సినిమాల్లో కూడా కనిపించే పనిలో ఉన్నారని సమాచారం. మొత్తానికి దక్షిణాది నాలుగుభాషల్లోనూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా భిన్నమైన పాత్రలు వెయ్యాలన్నది ఆమె కోరిక అని తెలుస్తోంది.
అయితే పెద్ద సినిమాల మీదే ఈమె దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. అలా కాకుండా మధ్యస్థాయి, చిన్న సినిమాలను కూడా ఆమె కరుణిస్తే బాగుంటుందని చిన్న నిర్మాతల ఆలోచన. లేడీ బాస్ ఏం చేస్తారో చూడాలి.