iDreamPost
android-app
ios-app

గాంఢీవధారి అర్జున ట్రైలర్.. యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ రైడ్!

  • Published Aug 10, 2023 | 8:56 PM Updated Updated Aug 10, 2023 | 8:56 PM
  • Published Aug 10, 2023 | 8:56 PMUpdated Aug 10, 2023 | 8:56 PM
గాంఢీవధారి అర్జున ట్రైలర్.. యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ రైడ్!

మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుణ్ ఎంచుకునే సబ్జెక్ట్స్ కూడా ఎంతో భిన్నంగా ఉంటూ ఉంటాయి. సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. అతను నటించిన తాజా మూవీ గాంఢీవధారి అర్జున సినిమాపై ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీలో వరుణ్ తేజ్ ఒక ఏజెంట్ లా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ లో యాక్షన్ సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎపిసోడ్ విషయంలో టాలీవుడ్ ప్రేక్షకులను ఈ మూవీ అస్సలు డిస్సపాయింట్ చేయదనే చెప్పేలా ఉంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, టీజర్ వచ్చిన విషయం తెలిసిందే. అవన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మూవీపై కచ్చితంగా అంచనాలు భారీగా పెరిపోతాయి. ఈ సినిమా ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ రైడ్ లాగా కనిపిస్తోంది. వరుణ్ తేజ్ ఒక ఏజెన్సీలో ఏజెంట్ గా పని చేస్తూ ఉంటాడు. అతనికి అప్పగించిన క్లైంట్ కోసం కావాలంటే చావడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. అలాంటి అతనికి భారతదేశ కేంద్ర మంత్రిని కాపాడే ఆపరేషన్ అప్పజెప్తారు. ఆ క్రమంలో హీరోకి చాలానే ఛాలెంజెస్ ఎదురైనట్లు చూపించారు.

అతడిని కాపాడాడా? కాపాడా క్రమంలో ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు? ఐరా అనే అమ్మాయి ఎవరు? ఇలాంటి చాలానే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో చూడాలి. అయితే ఈ కథ మొత్తం వరల్డ్ వైడ్ మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ రేంజ్ లో కనిపిస్తోంది. వైజాగ్ లోని సంబసింగి దగ్గర నుంచి కథ విదేశాల వరకు వెళ్తున్నట్లుగా చూపించారు. ఇందులో వరుణ్ తేజ్ యాక్టింగ్ లో చాలా మెచ్యూరిటీ కనిపిస్తోంది. అలాగే ట్రైలర్ లో వన్ మ్యాన్ షోలా అనిపిస్తోంది. ఈ ట్రైలర్ కి ఓపెనింగ్.. క్లోజింగ్ నాజర్ డైలాగ్స్ తోనే జరిగింది. లాస్ట్ లో ‘భూమికి అతి పెద్ద క్యాన్సర్ మనిషేనేమో?’ అంటూ నాజర్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ గా నిలుస్తోంది. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet