iDreamPost
iDreamPost
ప్రేమ. వినడానికి, చదవడానికి రెండు అక్షరాల పదమే. రెండు జీవితాలను కలపాలన్నా, విడదీయాలన్నా అది ప్రేమకే సాధ్యం. ఇది వరకూ ప్రేమ అంటే ఆడ – మగ మనసుల మధ్య పుట్టేది. కానీ.. టెక్నాలజీ యుగంలో ప్రేమకు అర్థాలు మారిపోతున్నాయి. లింగ బేధాలు లేకుండా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. సృష్టికి విరుద్ధంగా ఒక్కటవ్వాలని తహతహలాడుతున్నారు. అందుకోసం ఏం చేసేందుకైనా వెనుకాడటం లేదు. అలా ఒక లెస్బియన్ జంట ఎవరూ ఊహించని సాహసం చేసింది.
యూపీకి చెందిన ఇద్దరు లెస్బియన్లు.. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఇద్దరూ ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. విషయం ఇద్దరి ఇళ్లలో చెప్పి.. పెద్దవాళ్లను ఒప్పించేందుకు తమ సాయశక్తులా ప్రయత్నించారు. కానీ.. పెద్దలు వారి ప్రేమను అంగీకరించలేదు. ఏం చేయాలో పాలుపోక.. చివరికి ఆ ఇద్దరిలో ఒకరు లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రయాగ్ రాజ్ లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్ లో వైద్యుల బృందాన్ని సంప్రదించారు. మహిళను పరీక్షించిన వైద్యులు.. ఆమెకు టెస్టోస్టెరాన్ రీప్లేస్ మెంట్ థెరపీ చేస్తామని తెలిపారు. కానీ.. ఆమె అతనుగా మారేందుకు సుమారు ఒకటిన్నర సంవత్సరం (18 నెలలు) సమయం పడుతుందని, లింగమార్పిడి అనంతరం ఆమె గర్భందాల్చే పరిస్థితి ఉండదని చెప్తున్నారు. ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని వైద్యులు పేర్కొన్నారు.