SNP
SNP
సచిన్ టెండూల్కర్.. క్రికెట్ ప్రపంచానికి అతనో దేవుడు. ఇండియన్ క్రికెట్‌ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన క్రికెటర్. ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు, అద్భుతమైన మ్యాచ్‌లు, ప్రపంచ క్రికెట్‌లో గొప్ప గొప్ప బౌలర్లు కూడా సచిన్‌కు దాసోహం అన్నవారే. టన్నుల కొద్ది పరుగులు, వంద సెంచరీలు, వందకు పైగా వికెట్లు అబ్బో.. చెప్పుకుంటూ పోతే సచిన్ పేరిట లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి. సచిన్ ఆట చూసి భారత క్రికెట్ అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కానీ, అప్పటి క్రికెటర్లు కానీ, ఇలాంటి ఆటగాడు మళ్లీ ఈ భూమ్మిద జన్మిస్తాడా అని అనుకునే వాళ్లు. నిజం చెప్పాలంటే అలాంటి ఆటగాడు పుట్టడనే చెప్పాలి. అయితే.. సచిన్ తర్వాత అంతటి ఆటగాడు ఇండియన్ క్రికెట్‌లోనే ఉన్నాడంటూ చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అతనే విరాట్ కోహ్లీ.
సచిన్ టెండూల్కర్ రికార్డుల వెంట పడుతూ.. అద్భుతమైన క్రికెటర్‌గా పేరుతెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇతను కూడా ఏ సాధారణ ఆటగాడు కాదు. సచిన్ అంతటోడే అని చెప్పాలి కానీ, సచిన్‌ను మించి అంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు. అయితే.. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా మాత్రం.. సచిన్ టెండూల్కర్ కంటే కూడా విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు అంటూ కితాబిస్తున్నాడు. పైగా తన వాదనకు కొన్ని కారణాలు కూడా చూపిస్తున్నాడు. వన్డే క్రికెట్‌లో సచిన్ రికార్డులను, విరాట్ కోహ్లీ గణాంకాలు చూసుకోవాలని అంటున్నాడు. వన్డే క్రికెట్‌లో సచిన్ కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. దాదాపు సచిన్ సెంచరీలకు దగ్గరగా ఉన్నాడంటే పేర్కొన్నాడు. అందుకే వన్డేల్లో సచిన్ కంటే కోహ్లీనే బెటర్ అంటూ తెలిపాడు. తాను పెద్దయ్యేంత వరకు సచినే బెంచ్‌మార్క్ అని, కానీ ఇప్పుడు కోహ్లీ చాలా అద్భుతంగా ఆడుతున్నాడంటూ పేర్కొన్నాడు.
అయితే.. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో మొత్తం 463 వన్డేలు ఆడాడు. 452 ఇన్నింగ్స్‌ల్లో 44.83 సగటుతో 18426 పరుగులు చేశాడు. 86.24 స్ట్రైక్‌రేట్ కలిగి ఉన్నాడు. వన్డే కెరీర్‌లో 49 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016 ఫోర్లు, 195 సిక్సులు కొట్టాడు. అత్యధిక స్కోర్ 200. ఇక ఇప్పటి వరకు కోహ్లీ వన్డే కెరీర్‌ను పరిశీలిస్తే.. 284 వన్డేల్లో 272 ఇన్నింగ్స్‌లు ఆడి 57.56 సగటుతో 13239 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 93.63గా ఉంది. ఇప్పటి వరకు 47 సెంచరీ, 68 హాఫ్ సెంచరీలు సాధించాడు. 1241 ఫోర్లు, 143 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 183. అయితే.. కోహ్లీ మరింత కాలం వన్డే క్రికెట్‌లో కొనసాగే అవకాశం ఉండటంతో మరిన్ని నంబర్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి సచిన్ కంటే విరాట్ కోహ్లీ బెటర్ అని ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Usman Khawaja said – “I am going to say Virat Kohli is better than Sachin Tendulkar in ODIs. Look at his stats, he has almost same Hundreds but Virat has played so many less games. Sachin was benchmark when I grew up but when Virat is going, no one has done it”. (Fox Cricket) pic.twitter.com/4DVhdz0Jb8
— CricketMAN2 (@ImTanujSingh) October 16, 2023
ఇదీ: BREAKING: స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం!