iDreamPost
android-app
ios-app

24న ట్రంప్ భారత్ రాక ..

  • Published Feb 11, 2020 | 7:25 AM Updated Updated Feb 11, 2020 | 7:25 AM
  • Published Feb 11, 2020 | 7:25 AMUpdated Feb 11, 2020 | 7:25 AM
24న ట్రంప్ భారత్ రాక ..

రెండ్రోజుల పర్యటన ..వైట్ హౌస్ వెల్లడి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24,25 తేదీల్లో భారత్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ తేదీలను అమెరికా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. గతంలో రోనాల్డ్ రీగన్, సీనియర్ బుష్, జూనియర్ బుష్, ఒబామా తదితరులు భారత్ పర్యటించారు గానీ ట్రంప్‌ రావడం ఇదే తొలిసారి . ఆయన సతీమణి కూడా ఆయన వెంట వస్తారు. వారు దిల్లీ, అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారని వైట్ హౌస్ ప్రకటించింది.. గతవారం ప్రధాని మోదీ, ట్రంప్‌ పర్యటనపై ఫోన్‌లో చర్చించారని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం ఉన్నత శిఖరాలకు చేరుతుందని పరిశీలకులు ఆశిస్తున్నారు.

ఉభయ దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ ట్రంప్‌ పర్యటన ఖరారు కావడాన్ని ఇరు దేశాల వ్యాపార వర్గాలు స్వాగతించాయి. దీంతో గత కొన్ని నెలలుగా తలెత్తిన వాణిజ్య విభేదాలు సమసిపోతాయని ఆకాంక్షించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet