Chiranjeevi
టాలీవుడ్ లో భారీ సినిమాలు చకచకా నిర్మాణాలు జరుపుకుంటున్నాయి. కానీ రెండు సినిమాల ముచ్చట ఏమిటి? అన్నది తెలియడం లేదు. విశ్వంభర..స్వయంభు. ఈ రెండు సినిమాలు మొదలు పెట్టి ఏళ్లు గడుస్తోంది. ఓటిటి మార్కెట్ బాగున్న కాలంలో భారీ ఖర్చుతో వీటిని ప్రారంభించారు. పూర్తి చేసారు. కానీ విడుదల ఎప్పుడు అన్నది మాత్రం క్లారిటీ లేదు.

విశ్వంభర సినిమా గురించి హీరో మెగాస్టార్ కూడా ఎక్కడా ప్రస్తావించడం లేదు. చాలా సభలకు వస్తున్నారు. సందర్భాల్లో మాట్లాడుతున్నారు. కానీ విశ్వంభర అనే పదం ఆయన నోట దొర్లడం లేదు. విశ్వంభర తరువాత శంకర ప్రసాద్ స్టార్ట్ చేసి పూర్తిచేసి విడుదల చేసారు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చకచకా షూట్ చేసేస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ నాటికి విడుదల చేయాలన్నది టార్గెట్.
మరి డిసెంబర్ లో విడుదల చేయాలి అంటే కనీసం దానికి ఆరు నెలలు ముందుగా అయినా విశ్వంభర విడుదల చేయాలి. కానీ జూలై వచ్చేసింది. అయిదు నెలలే గ్యాప్ వుంది. ఇంత తక్కువ గ్యాప్ లో రెండు సినిమాలు వదులుతారా అన్నది డౌటే.
విశ్వంభర సినిమా సమస్య. నాన్ థియేటర్ అమ్మకాలు. ఆ సినిమాకు భారీగా ఖర్చు చేసేసారు. దాదాపు మూడు వందల కోట్లు ఖర్చు చేసారని టాక్ వుంది. థియేటర్ మీద నుంచి మహా అయితే 150 కోట్లకు మించి రాదు. గట్టిగా లాగినా 200 కోట్లు వస్తుంది అనుకంటే వంద కోట్లు నాన్ థియేటర్ మీద నుంచి రావాలి. కానీ అందులో సగం కూడా రావడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టం అనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా వుంటే నెల నెల వడ్డీల భారీ పెరిగిపోతూనే వుంటుంది. కనీసం 150 కోట్లు ఫైనాన్స్ తెచ్చి వుంటారు. ఆ సినిమాకు. రెండు రూపాయల వడ్డీ అంటే నెలకు ఎంత? ఇదంతా సినిమా మీద బరువు పెంచుతూనే వుంటుంది.
మరో పక్క సినిమా సిజి వర్క్ అంతా పూర్తి కావాలి. టోటల్ ఫుటేజ్ రావాలి. ఓటిటి వాళ్లు చూసి అప్పుడు రేటు చెప్పాలి. అలా చేయాలంటే ఓటిటి బిల్లు మొత్తం ముందే క్లియర్ చేయాలి. అది కూడా సమస్య నే.
స్వయంభు కూడా అంతే
కార్తికేయ 2 హిట్ చూసి, అంచనాలు వేసుకుని స్వయంభు సినిమా నిర్మాణం ప్రారంభించారు. నిఖిల్ హీరో గా కొత్త దర్శకుడితో. ఇది కూడా దాదాపు 80 కోట్ల ఖర్చుతో కూడిన సినిమా. నిఖిల్ తో అంత ఖర్చు అంటే కాస్త ఎక్కువే. కానీ హిట్ అయితే సమస్య కాదు. అయినా ఈ సినిమాకు కూడా ఓటిటి సమస్యనే. నాన్ థియేటర్ అమ్మకాల మీద కుస్తీ పడుతున్నారు. విశ్వంభర కన్నా కాస్త బెటర్ పొజిషన్ లో వుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే బయ్యర్లు కాపీ చూడాలని అడగడం.
అంటే ఒరిజినల్ ఫుటేజ్ చూసి కానీ రేటు చెప్పరన్నమాట. అలా ఒరిజినల్ ఫుటేజ్ చూపించాలి అంటే సిజి వర్క్ లు అన్నీ పూర్తిగా రావాలి. అవి శాటిస్ ఫ్యాక్టరీగా రావాలి. వాటికి ఫుల్ పేమెంట్ ఇవ్వాలి. అప్పుడు కాపీ రెడీ అవుతుంది. ఇక్కడ కూడా ఫైనాన్స్ సమస్యనే. నెల నెలా వడ్డీల భారం పెరుగుతూనే వుంటుంది.
హీరో నిఖిల్ స్వయంభు ను ఆ మధ్య గట్టిగా ప్రమోట్ చేసారు. టీజర్, పాట వదిలారు. జనాల్లోకి వెళ్లారు. కానీ తరువాత ఆపేసారు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో వున్నారు. తన తరువాత సినిమా ఇండియా హవుస్ ను కొంత మేరకు షూట్ చేసారు.
మరి స్వయంభు ఆగస్ట్ లో కానీ దసరాకు కానీ వస్తుందా అన్నది చూడాలి. ఆగస్ట్ 15 విడుదల అన్నది ప్రస్తుతానికి వినిపిస్తున్న డేట్. అదే నిజమైతే మరో వారం రోజుల్లో ప్రమోషన్ స్టార్ట్ చేయాల్సి వుంటుంది.
టాలీవుడ్ ఓటిటి సంధికాలంలో ఈ రెండు సినిమాలతో పాటు నాగ్ చైతన్య వృషకర్మ కూడా మొదలైంది. అది కూడా ఇంకా ఓటిటి అమ్మకాలు జరుపుకోలేదు. అది కూడా 130 కోట్ల బడ్జెట్ సినిమా. దాన్ని ఎలా కవర్ చేసుకుంటారో చూడాలి.