iDreamPost
android-app
ios-app

హోం వర్క్ చేయలేదని UKG పిల్లవాడ్ని కొట్టి చంపిన టీచర్!

హోం వర్క్ చేయలేదని UKG పిల్లవాడ్ని కొట్టి చంపిన టీచర్!

తమ ముద్దు ముద్దు మాటలతో, చిలిపి చేష్టలతో నవ్విస్తుంటారు చిన్నపిల్లలు. ఎంతటి సమస్య అయినా వీరి చిరునవ్వులు చూస్తే ఇట్టే ఎగిరిపోతుంది. అలాంటి పిల్లలపై ఓ టీచర్ చేయి చేసుకోవడమే కాకుండా ఏకంగా ప్రాణం తీసింది. అదీ కూడా అల్లరి చేస్తున్నాడనో, మరో పిల్లలను గిల్లాడనో, గిచ్చాడనో, కొట్టాడనో కాదూ.. హోం వర్క్ చేయలేదని పలక పెట్టి కొట్టడంతో తీవ్ర గాయమై ఐదేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన ఈ ఘటన హైదరాబాద్ రామాంతపూర్ వివేక్ నగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

వివేక్ నగర్‌లో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో యుకేజీ చదువుకున్నాడు హేమంత్ (5). ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లాడు. అయితే హోం వర్క్ గురించి టీచర్ అడగ్గా.. చేయలేదని చెప్పడంతో.. కోపంతో పలక తీసుకుని తలపై గట్టిగా కొట్టడంతో హేమంత్ స్పృహ తప్పిపడిపోయాడు. భయభ్రాంతులకు గురైన స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఏమందని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో స్కూల్ టీచర్, యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో కన్నీటి పర్యంతమయ్యారు తల్లిదండ్రులు. బాలుడి మృతదేహంతో పాఠశాల ఎదుట బైఠాయించారు. చదువు చెబుతారని పంపిస్తే.. ఇలా ప్రాణం తీశారని మండిపడ్డారు. టీచర్ ను కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet