iDreamPost
android-app
ios-app

స్వామీజీలకు అన్ని కోట్లు ఎక్కడ నుండి వస్తున్నాయి : ఉదయనిధి స్టాలిన్

  • Published Sep 05, 2023 | 1:03 PM Updated Updated Sep 05, 2023 | 1:03 PM
  • Published Sep 05, 2023 | 1:03 PMUpdated Sep 05, 2023 | 1:03 PM
స్వామీజీలకు అన్ని కోట్లు ఎక్కడ నుండి వస్తున్నాయి : ఉదయనిధి స్టాలిన్

సనాతన ధర్మంపై కోలీవుడ్ నటుడు, తమిళనాడులోని చెపాక్ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. తమిళనాడు ప్రొగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయన.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అన్నారు. డెంగ్యూ, మలేరియా, కరోనాను తరిమికొట్టినట్టుగానే.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హిందూ, ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. బీజెపీ నేతలు సైతం ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. కాగా, తన కుమారుడు చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సమర్థించిన సంగతి విదితమే. బీజెపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మతాన్ని ఆయుధంగా వాడుతోందని, మతపరమైన భావాలను రెచ్చగొట్టి.. ఆ మంటలపై చలికాచుకుంటుందని మండిపడ్డారు.

కాగా, ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై అయోధ్య సాధువు జగద్గురు పరమహంస ఆచార్య సంచలన ప్రకటన చేశారు. ఆయన తల నరికి తీసుకు వస్తే ఏకంగా రూ. 10 కోట్లు ఇస్తానంటూ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఉదయ్ ఫోటోను కత్తితో పొడుస్తూ కనిపించారు. కాగా, ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. పరమహంస వీడియోపై ఉదయనిధి గట్టి కౌంటరిచ్చారు. ‘ఓ సాధువు నా తలపై రూ. 10 కోట్ల రివార్డు ప్రకటించారు. నా తల నరికితే తెస్తే రూ.10 కోట్లు ఇస్తానని అన్నారు. అతను నిజమైన సాధువా లేక నకిలీనా? అతనికి నా తల ఎందుకు అంత ఇష్టం? మీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? నా తల తీసుకెళ్లి..నా జుట్టు దువ్వడానికి రూ.10 కోట్లు ఎందుకు? రూ.10 విలువైన దువ్వెన ఇస్తే నా తల నేనే దువ్వుకుంటాను కదా?‘ అంటూ సెటైరికల్ గా కౌంటరిచ్చారు. తన తల కోసం ఎవరు వస్తారో చూస్తానని, గతంలోనూ తన తాత, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిపై రూ.కోటి ప్రకటించారని అన్నారు. తాను ఎవరికీ భయపడనని తెలిపారు. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio