iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటి మృతి

మరణం అనేది మనిషికి ఖాయం. కానీ అది ఎటు నుండి ఎలా వస్తుందో ఊహించడం కష్టం. ఆనందం సమయాల్లోనూ దుఖాన్ని నింపగలుగుతుంది మరణం. జీవితాలను తల్లకిందులు చేయగలదు. గుండెల్లో భారాన్ని నింపి.. ఇష్టమైన వ్యక్తులను దూరం చేస్తుంది మృత్యువు.

మరణం అనేది మనిషికి ఖాయం. కానీ అది ఎటు నుండి ఎలా వస్తుందో ఊహించడం కష్టం. ఆనందం సమయాల్లోనూ దుఖాన్ని నింపగలుగుతుంది మరణం. జీవితాలను తల్లకిందులు చేయగలదు. గుండెల్లో భారాన్ని నింపి.. ఇష్టమైన వ్యక్తులను దూరం చేస్తుంది మృత్యువు.

ఇండస్ట్రీలో  విషాదం.. గుండెపోటుతో నటి మృతి

బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు వరుసగా విషాదాలు అలముకుంటున్నాయి. గత నెలలో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమల్లో ప్రముఖుల ఇంట్లో మరణ వార్తలు వినిపించాయి. కోలీవుడ్ నటుడు నాజర్ తండ్రి మాబూబ్ బాషా, ఆ తర్వాత ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ ఫెర్నాండేజ్ కన్నుమూశారు. మాలీవుడ్ ప్రముఖ నటుడు కుందర జానీ గుండె పోటుతో మరణించిన సంగతి విదితమే. ఈ సంఘటనలన్నీంటి కన్నా ముందు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యాం సుందర్ రెడ్డి మరణించిన సంగతి విదితమే. ఇటీవలే మలయాళ టీవీ, సినీ నటి రెంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇప్పుడు మరో నటి మరణించింది.

ప్రముఖ టీవీ నటి డాక్టర్ ప్రియ గుండెపోటుతో కన్నుమూసింది. అయితే ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భిణీ కావడం గమనార్హం. గత నెల 31న రెగ్యులర్ ప్రెగ్నెన్సీ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ప్రియ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన వైద్యులు.. ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. ప్రస్తుతం చిన్నారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమె మరణవార్తను నటుడు కిశోర్ సత్య సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ టెలివిజన్ పరిశ్రమ నుండి ఊహించని మరో విషాదం నెలకొంది. ప్రియ గుండెపోటుతో మరణించింది. ఆమె 8 నెలల గర్భిణీ. ప్రస్తుతం పాప ఐసీయూలో ఉంది. ఆమెకు ఇతర అనారోగ్య సమస్యలు లేవు’ అని పేర్కొన్నారు.

ఒక్కగానొక్క కుమార్తె ప్రియ మరణవార్తను తల్లి జీర్ణించుకోలేకపోతుందని. గత ఆరు నెలలుగా ఆమెను భర్త కంటికి రెప్పలా చూసుకుంటున్నాడని పేర్కొన్నారు. డా. ప్రియ మలయాళ టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచితురాలు. కరుతముత్తులో చేసిన యాక్టింగ్ ఆమెకు పేరు తెచ్చింది. అయితే పెళ్లి తర్వాత నటనకు కాస్త విరామం ఇచ్చింది. ఆమె డాక్టర్ కూడా. తిరువనంతపురంలోని పీఆర్ఎస్ ఆసుపత్రిలో వైద్యురాలిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఆమె ఎండీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Kishor Satya (@kishor.satya)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis