iDreamPost
android-app
ios-app

Tummala Nageswara Rao: రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు

  • Published Jun 19, 2024 | 1:27 PM Updated Updated Jun 19, 2024 | 1:27 PM

తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు. 2,3 రోజుల్లో వారి ఖాతాల్లో నగదు జమ చేస్తాము అని తెలిపారు. ఆ వివరాలు..

తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు. 2,3 రోజుల్లో వారి ఖాతాల్లో నగదు జమ చేస్తాము అని తెలిపారు. ఆ వివరాలు..

  • Published Jun 19, 2024 | 1:27 PMUpdated Jun 19, 2024 | 1:27 PM
Tummala Nageswara Rao: రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. అధికారంలోకి రాగానే ముందుగా ఆరు గ్యారెంటీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. దీనిలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ మొత్తాన్ని రూ.5 నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం చేసింది. అలానే గృహజ్యోతి పథకం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ స్కీమ్‌లను ప్రారంభించి.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పకనే చెప్పింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రకటించింది. కానీ మధ్యలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో.. పలు గ్యారెంటీల అమలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు కోడ్‌ ముగియడంతో ఎన్నికల హామీలు, గ్యారెంటీలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్‌ సర్కార్‌.

ఆగస్టు 15 లోగా రూ.2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అలానే త్వరలోనే పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులు కూడా విడుదల చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ వ్యవసాయం శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. 2, 3 రోజుల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని తెలిపారు. ఇంతకు ఇవి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు.. ఎవరి ఖాతాలో నగదు జమ చేస్తారంటే..

ఆయిల్ పామ్, అంతర పంటలు సాగు చేసే రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. రైతులు, కంపెనీల చెల్లింపులకు సంబంధించిన రూ.100.76 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేసినట్లు వెల్లడించారు. రానున్న 2-3 రోజుల్లో ఆయిల్‌ పామ్‌ తోటల నిర్వహణ, అంతర పంటల సాగు చేసే రైతుల ఖాతాలో ఈ నిధులు జమ అవుతాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఉద్యానశాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని తుమ్మల తెలిపారు. 2022-23 నుంచి పెండింగ్‌లో ఉన్న డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించిన రూ. 55.36 కోట్లను కూడా తమ ప్రభుత్వం విడుదల చేసిందని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

రుణమాఫీపైనా మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 లోగా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే.. 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ నెల 21న అనగా మరో రెండు రోజుల్లో శుక్రవారం నాడు కేబినెట్‌ భేటీ ఉంటుందని.. ఈ సమావేశంలో రుణమాఫీ అర్హులు, కటాఫ్‌ తేదీలపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాక తమది రైతు పక్షపాత ప్రభుత్వమని.. అన్నదాతల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా మారోసారి స్పష్టం చేశారు.